మెగా అభిమానుల నిరీక్షణ ఫలించింది
Send us your feedback to audioarticles@vaarta.com
గతేడాది డిసెంబర్ నెల నుంచి ఈ ఏడాది ఏప్రిల్ వరకు.. అంటే ఐదు నెలల పాటు ప్రతీ నెల కనీసం ఒక మెగా సినిమా విడుదలయ్యేట్టు చక్కగా ప్లాన్ చేసుకున్నారు మెగా హీరోలు. ఈ వరుసలోనే మొదటగా.. డిసెంబర్ 1న సాయిధరం తేజ్ నటించిన జవాన్` విడుదలైంది. ఆశించిన ఫలితం దక్కలేదు. ఆ తర్వాత అదే నెలలో విడుదలైన అల్లు శిరీష్ ఒక్క క్షణం` కూడా అంచనాలను అందుకోవడంలో విఫలమైంది. ఆఖరికి పవన్ కళ్యాణ్ చరిష్మా కూడా ఈ ఫ్లాపుల పరంపరకు అడ్డుకట్ట వేయలేకపోయింది.
అజ్ఞాతవాసి` పేరుతో జనవరిలో విడుదలైన పవన్ 25వ చిత్రం.. అతని కెరీర్లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలిచిపోయింది. ఇక ఫిబ్రవరి నెలలో తొలుతగా వచ్చిన సాయిధరమ్ ఇంటిలిజెంట్` కూడా పరాజయాల బాట పట్టింది. మూడు నెలల్లో వరుసగా నాలుగు మెగా మూవీస్ ఫ్లాప్ అవడంతో.. అందరి చూపులు వరుణ్ తేజ్ నటించిన తొలిప్రేమ`పై పడ్డాయి. శనివారం విడుదలైన ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది. తొలి రోజు వసూళ్ళు కూడా బాగానే ఉన్నాయి. మొత్తానికి.. మంచి విజయం కోసం ఎదురుచూస్తున్న మెగాభిమానుల నిరీక్షణ ఫలించిందన్నమాట. కాగా, మార్చిలో రామ్ చరణ్ 'రంగస్థలం'.. ఏప్రిల్‌లో అల్లు అర్జున్ 'నాపేరు సూర్య' విడుదల కానున్న సంగతి తెలిసిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com