Charmy Kaur : లైగర్ ఫ్లాప్, ఛార్మీ మీద పగ తీర్చుకుంటోన్న మెగా ఫ్యాన్స్.. మరీ ఈ రేంజ్ ట్రోలింగా..?
Send us your feedback to audioarticles@vaarta.com
యూత్‌లో మంచి క్రేజ్ వున్న విజయ్ దేవరకొండ, ఇస్మార్ట్ శంకర్ హిట్ తర్వాత మంచి ఊపు మీదున్న పూరి జగన్నాథ్ కాంబినేషన్లో మంచి సినిమా అంటే అంచనాలు ఏ రేంజ్లో వుంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దీనికి బాలీవుడ్ ముద్దుగుమ్మ అనన్య పాండే, దిగ్గజ బాక్సర్ మైక్ టైసన్ తోడైతే సగటు ప్రేక్షకుడు ఊహించుకోవడానికి కూడా కష్టమే. ఇవన్నీ మేళవించి తీసిన చిత్రమే ‘లైగర్’. ఈ సినిమాపై గడిచిన కొద్దినెలలుగా మంచి బజ్ వుంది. టీజర్, ట్రైలర్, ప్రచార హడావుడి చూసి సినిమాను ఎప్పుడెప్పుడు వీక్షిద్దామా అంటూ ప్రజలు ఎదురుచూశారు. ఎన్నో అంచనాల మధ్య గురువారం విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. లైగర్‌లో విషయం లేదని.. ఇది అసలు పూరీ జగన్నాథ్ సినిమానేనా అంటూ ప్రేక్షకులు పెదవి విరిచారు.
బ్రూస్ లీ టైమ్‌లో ఛార్మీ ట్వీట్:
ఇదిలావుండగా.. లైగర్ చిత్ర నిర్మాతల్లో ఒకరైన సీనియర్ హీరోయిన్ ఛార్మీని ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఆడుకుంటున్నారు. దీనికి కారణం లేకపోలేదు. గతంలో ఆమె చేసిన ఓ ట్వీట్ ఈ ట్రోలింగ్‌కు కారణంగా తెలుస్తోంది. రామ్‌చరణ్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన బ్రూస్లీ విడుదలై అట్టర్ ఫ్లాప్ అయ్యింది. దీంతో మెగా ఫ్యాన్స్ బాగా డిజాప్పాయింట్ అయ్యారు. ఈ బాధలో వుండగానే ఛార్మీ చేసిన ట్వీట్ వారికి మరింత ఆగ్రహం తెప్పించింది. లాఫింగ్, క్లాప్స్ ఎమోజీలతో కూడిన ఆ ట్వీట్ చరణ్ గురించేనని మెగా అభిమానులు భావించారు.
టైమ్ చూసి కొట్టిన మెగా ఫ్యాన్స్:
కానీ అప్పుడు తొందరపడకుండా టైమ్ కోసం వెయిట్ చేశారు. ఆ టైం ఇప్పుడు రానే వచ్చింది. లైగర్ మూవీ ఫ్లాప్ అయ్యిందని తెలియగానే ‘బ్రూస్లీ’ సమయంలో ఛార్మీ చేసిన ట్వీట్‌ని బయటకు తీసి కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. స్పెషల్ మీమ్స్‌తో ఛార్మీని ఆడుకుంటున్నారు. ఇప్పటికే లైగర్ ఫెయిలైందనే బాధలో వున్న ఛార్మీకి మెగా అభిమానుల ట్రోలింగ్ మూలిగే నక్క మీద తాటికాయ పడ్డ చందంగా మారింది. అంతా బాగానే వుంది కానీ అసలు ఇంతకీ ఛార్మీ ఆనాడు చేసిన ట్వీట్ ‘బ్రూస్ లీ’ని ఉద్దేశించినదేనా, లేక మరేదైనానా అని కొందరు ప్రశ్నిస్తున్నారు. విషయం తెలియనప్పటికీ మెగా ఫ్యాన్స్ మాత్రం ఛార్మీని విడిచిపెట్టడం లేదు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout