గ్రేటర్ మెగాఫ్యాన్స్ ప్రెసిడెంట్ ఇంటికి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్

  • IndiaGlitz, [Friday,March 25 2016]

మెగా పవర్ స్టార్ రాంచరణ్ బర్త్ డే వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు గ్రేటర్ హైదరాబాద్ మెగా ప్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నూర్ మహ్మద్ భారీగా ప్లాన్ చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నేరుగా ముషీరా బాద్ లో ఉన్న నూర్ మహ్మద్ ఇంటికి వెళ్లారు. రాంచరణ్ బర్త్ డే వేడుకల్ని గ్రాండ్ గా ప్లాన్ చేసినందుకు అభినందిస్తూ... తన వంతుగా ఆర్థిక సాయం కూడా అందించారు. ఈ సందర్బంగా

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మాట్లాడుతూ.... మెగా పవర్ స్టార్ రాంచరణ్ బర్త్ డే వేడుకల్ని గ్రాండ్ గా చేసేందుకు నూర్ మహ్మద్ భారీగా ప్లాన్ చేశారని తెలిసింది. అందుకే అయన్ని అభినందించేందుకు ఇంటికి వచ్చాను. వారి ఫ్యామిలీతో కలిసి రాంచరణ్ బర్త్ డే కేక్ కట్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. రాంచరణ్ కు మెగాభిమానులంతా ఎల్లప్పుడూ అండగా ఉంటారు. ఆయనకు మా ప్రేమాభిమానాలు ఎప్పటికీ ఉంటాయి. అభిమానులు హైదరాబాద్ లో చేయబోయే రాంచరణ్ బర్త్ డే వేడుకల్లో నేను ప్రత్యక్షంగా పాల్గొనలేకపోతున్నా... ఎందుకంటే... మా ఇంట్లో శ్రీజ వివాహ వేడుక ఉంది. ఏదైనా అభిమానులంతా కలిసి రాంచరణ్ జన్మదిన వేడుకల్ని ఇంత గ్రాండ్ గా చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. అని అన్నారు.

ఈ సందర్భంగా నూర్ మహ్మద్ మాట్లాడుతూ.... అల్లు అర్జున్ గారు మా ఇంటికి రావడం చాలా హ్యాపీగా ఉంది. గతంలో నాకు ఆపరేషన్ జరిగి లేవలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా వచ్చి నన్ను పరామర్శించారు. మేం చేసే మెగా కార్యక్రమాల్ని ప్రోత్సహిస్తూనే... ఆర్థిక సాయం అందించిన అల్లు అర్జున్ గారికి అభిమానులందరి తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మెగా పవర్ స్టార్ రాంచరణ్ బర్త్ డే వేడుకల్ని ఈ సారి గతంలో చేసిన దాని కంటే గ్రాండ్ సక్సెస్ చేసేందుకు కష్టపడుతున్నాం. రక్తదాన శిబిరాలతో పాటు పలు సేవా కార్యక్రమాలు ఈ సందర్భంగా చేస్తున్నాం. అని అన్నారు.