మెగా ఫ్యాన్స్ కు డబుల్ బొనాంజా....

  • IndiaGlitz, [Monday,November 28 2016]

ఈ డిసెంబ‌ర్ 9న మెగాఫ్యాన్స్ సంబ‌ర‌మే. ఎందుకంటే మెగాప‌వ‌ర్ స్టార్ రాంచ‌ర‌ణ్ న‌టించిన ధృవ విడుద‌ల కానున్న‌ది డిసెంబ‌ర్ 9. ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమంటే ధృవ సినిమా థియేట‌ర్స్‌లో ఖైదీ నంబ‌ర్ 150 సినిమా టీజ‌ర్‌ను ప్ర‌ద‌ర్శించ‌నున్నార‌ట‌. ఒకే థియేట‌ర్‌లో మెగాభిమానులు రాంచ‌ర‌ణ్ ధృవ‌తో పాటు మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నంబర్ 150 ని కూడా ఎంజాయ్ చేయ‌బోతున్నారన్న‌మాట‌.

మెగాప‌వ‌ర్‌స్టార్ రాంచ‌ర‌ణ్, ర‌కుల్ జంట‌గా సురేంద‌ర్‌రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో గీతాఆర్ట్స్ బ్యాన‌ర్‌లో రూపొందిన స్టైలిష్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ 'ధృవ' డిసెంబ‌ర్ 9న విడుద‌ల‌కానుంది. ప‌వ‌ర్ పోలీస్ ఆఫీస‌ర్‌కు, తెలివైన విల‌న్‌కు మ‌ధ్య జ‌రిగే మైండ్‌గేమ్‌తో రూపొందిన ఈ సినిమా సెన్సార్ కార్య‌క్ర‌మాల‌ను కూడా పూర్తి చేసుకుంది. డిసెంబ‌ర్ 4న సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ జ‌రుపుకోనుంది.