కరోనా నేపథ్యంలోనూ విజయసాయి వర్సెస్ మెగా బ్రదర్

కరోనా మహమ్మారి కాటేస్తున్న నేపథ్యంలోనూ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం రాజకీయాలు ఆగట్లేదు. తమ వంతు సాయం చేసి పేదలను.. కరోనా బాధితులను ఆదుకోవాల్సిన నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటూ హాట్ టాపిక్ అవుతున్నారు. ఇందులో ఏ పార్టీకి చెందిన వారూ తక్కువ కాదు. ఈ టైమ్‌లో ఇలాంటివి అవసరమా..? లేదా..? అనేది కాస్త కూడా ఆలోచించకుండానే నోటికొచ్చినట్లు తిట్టేయడం.. సోషల్ మీడియా వేదికగా ఇష్టానుసారం ట్వీట్స్, పోస్ట్‌లు చేయడం బూతులు తిట్టేసుకుంటున్నారు. అయితే.. వీరందరిలో ప్రస్తుతం వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి.. మెగా బ్రదర్, నటుడు, జనసేన నేత నాగబాబుల మధ్య ట్విట్టర్ వేదికగా వార్ నడుస్తోంది. ఒకరేమో విమర్శిస్తూ ట్వీట్ చేస్తే దానికి స్పందించి మరీ కౌంటర్ ఎటాక్ చేస్తూ ఇంకొకరు ట్వీట్ చేస్తూ దుమారం రేపుతున్నారు. అసలు వీరిద్దరి మధ్య జరిగిన వార్‌ ఏంటో ఇప్పుడు చూద్దాం.

కుక్కలు కూడా మొరగవ్..

జనసేన అధినేత పవన్ కల్యాణ్, ఆయన సోదరుడు నాగబాబును ఉద్దేశించి ట్వీట్ చేశారు. వాస్తవానికి చాలా రోజులుగా ఈ ఇద్దరి మధ్య ట్వీట్స్ చేసుకుంటూ ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటున్నారు. ‘సినిమాలు, టీవీ షోలు చేసుకుంటూ పార్టీని గాలికి వదిలేసినవాళ్లకు రాజకీయాలెందుకు..?. 2014లోనే మేం పొత్తులు పెట్టుకోలేదని.. పొత్తులుండవని పార్టీ అధినేత జగన్ స్పష్టమైన విధానాన్ని ప్రకటించారు. చిరంజీవి గారి తమ్ముళ్లు కాకపోతే కుక్కలు కూడా మొరగవ్. పావలా బ్యాచికి రోషం పొడుచుకొచ్చింది’ అని ఎద్దేవా చేస్తూ విజయసాయి ట్వీట్ చేశారు.

ప్యాకేజీ కోసం పుట్టిన పార్టీ..

‘చంద్రబాబు కోసం ప్యాకేజి తీసుకుని పుట్టిన పార్టీ అది. రిజిస్టర్ చేసినప్పటి నుంచి ఎవరి కోసం తోక ఊపుతూ మాట్లాడాడో ప్రజలందరికీ తెలుసు. అలాంటి పార్టీతో మేం పొత్తు పెట్టుకుంటామని కలేమైనా కన్నారా?. పార్టీ అధ్యక్షుడు రెండు చోట్ల చిత్తుగా ఓడిపోతాడని అందరికీ ముందే తెలుసు’ అని విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు.

వైఎస్సార్ ఆడిటర్ కాకపోయింటే..!

మేం సాధారణమైన వ్యక్తులం. మేం సినిమాలు, టీవీ షోలు చేయకపోతే కుటుంబాలను పోషించుకోలేం. అయినా మీకు ఆ అవసరం లేదు లెండి.. మంది సొమ్ము బాగా మెక్కారు కదా..? ఇంకో 1000 ఏళ్లు కాలుమీద కాలువేసుకుని హాయిగా దొంగ లెక్కలు వేసుకుంటూ బతికగలరని మాకు తెలుసు. అవార్డులు అందుకోగల పారిశ్రామికవేత్తలను జైలు పాలుచేసింది తమరి ప్రతిభే కదా. మీరు వైఎస్సార్ ఆడిటర్ కాకపోయి ఉంటే శతకోటి గొట్టంగాళ్లలో ఒక గొట్టంగాడని వదిలేసేవాడ్ని..! ఈ కరోనా టైమ్ లో నీలాంటి గొట్టంగాళ్లు నాతో ట్వీట్ చేసే బదులు, భవిష్యత్తులో ఏ జైల్లో ఎలా టైమ్ పాస్ చేయాలో ఇప్పటినుంచే ఒక షెడ్యూల్ తయారుచేసుకోవాలి... టైమ్ కలిసొస్తుంది’ అని విజయసాయికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. వీరిద్దరి మధ్య జరిగిన ట్విట్టర్ వార్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. వీరిద్దరి ట్వీట్స్‌తో మరోసారి మెగాభిమానులు, జనసేన కార్యకర్తలు.. వర్సెస్ వైసీపీ కార్యకర్తలుగా పరిస్థితులు మారిపోయాయ్.