శభాష్.. జగన్ రెడ్డే వాళ్లకు కరెక్ట్ : మెగా బ్రదర్
Send us your feedback to audioarticles@vaarta.com
టాలీవుడ్ అ్రగనటుడు కమ్ హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఇండస్ట్రీపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యల వ్యవహారానికి ఇప్పట్లో ఫుల్ స్టాప్ పడేలా కనిపించట్లేదు. తెలుగు మీడియా చానెల్స్ కొన్ని అటు టీడీపీ.. ఇటు వైసీపీకి అనుకూలంగా ఎప్పట్నుంచో మారిపోయాయ్.. ఇది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా చానెల్స్ చూసే.. వార్తా పత్రికలు చూసే వీక్షకులకు బాగా తెలుసు. ‘ఇండస్ట్రీ తరఫున జరిగిన ఏ సమావేశానికి నన్ను ఎవడూ పిలవలేదు’ అన్న ఒక్క మాటను పట్టుకుని ఎంతెంత రాద్ధాంతం చేశారో అందరికీ తెలిసిందే. ఆ తర్వాత జూన్-09న ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని మెగాస్టార్ చిరంజీవితో పాటు అగ్ర హీరోలు, నిర్మాతలు, దర్శకులు కలిసి ఇండస్ట్రీ విషయాలపై చర్చించారు. అనంతరం మీడియా మీట్ కూడా నిర్వహించి.. అసలేం జరిగింది..? ఏమేం చర్చించామనే విషయాలపై చిరు అన్నీ పూసగుచ్చినట్లుగా చెప్పారు కూడా. అయితే ఒకట్రెండు టీవీ చానెల్స్ మాత్రం భేటీలో ఏదేదో జరిగిపోయిందని ఏకంగా డిబెట్స్ పెట్టి మరీ నానా హడావుడి చేశారు.
ఆ ట్వీట్ సారాంశం ఇదీ..
ఈ మొత్తం వ్యవహారంపై మెగా బ్రదర్ నాగబాబు ట్విట్టర్ వేదికగా స్పందించారు. చంద్రబాబు తప్పులను ఎత్తి చూపిస్తుంటే.. విపక్షాలకు కొన్ని పత్రికలు మద్దతుగా నిలుస్తున్నాయని, ఈ విషయంలో ఒక్కోసారి జగన్ మోహన్ రెడ్డి చేస్తున్నదే సరైనదని అనిపిస్తోందని నాగబాబు వ్యాఖ్యానించారు. ‘ఓడ మల్లయ్య అని.. బాబోరి తప్పుల్ని ఎత్తి చూపిస్తే బోడి మల్లయ్య అంటూ ప్రతిపక్ష పార్టీ నాయకులను చక్కగా విమర్శిస్తూ.. బాబోరి ప్రయోజనాలను కాపాడే రక్షణ కవచాలుగా వారు చూపిస్తున్న తెగువ, బాబుగారికి దగ్గరగా వుండే బాబులను కూడా ముద్దు చేసే వారి మమతానురాగాలు.. వావ్... ఇది అసలైన వార్తాపత్రికల స్పిరిట్ అంటే..శభాష్.. (ఒక్కోసారి జగమ్మోహన్ రెడ్డి గారే వీళ్ళకి కరెక్ట్ అని డౌట్ వస్తుందేంటి?)’ అని నాగబాబు ట్వీట్‌తో కొట్టారు.
మళ్లీ వర్సెస్..
అయితే ఇందుకు టీడీపీ అభిమానులు, పలువురు నెటిజన్లు సైతం విమర్శలు గుప్పిస్తూ కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు ఈ ట్వీట్‌తో మెగా వర్సెస్ టీడీపీ కార్యకర్తలుగా సోషల్ మీడియాలో పరిస్థితులు నెలకొన్నాయి. ఇంకొదరైతే ఏదో ఒక వివాదం తప్పితే సక్రమంగా ఏ రోజూ ట్వీట్ చేయరేంటి..? మీకు కావాల్సింది వివాదాలేనా..? అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక వైసీపీ అభిమానులు అయితే ఎట్టకేలకు మా అభిమాన రాజకీయ నేత జగనే కరెక్ట్ అని.. గ్రేట్ అని ఒప్పుకున్నారబ్బా అని కామెంట్ల రూపంలో చెబుతున్నారు. అప్పట్లో పవన్ వర్సెస్ కొన్ని చానెల్స్ పరిస్థితులు ఏర్పడటం.. దాడులు కూడా జరగడం.. ఫలానా పత్రికలు, టీవీ చానెల్‌ను అభిమానులు బ్యాన్ చేయాలని కూడా డిమాండ్ చేయడం అవన్నీ తెలిసిన విషయాలే. సో.. తాజాగా అవే పరిస్థితులు రిపీటయ్యే పరిస్థితులు మాత్రం కనిపిస్తున్నాయని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదేమో.!.
ఓడ మల్లయ్య అని,, బాబోరి తప్పుల్ని ఎత్తి చూపిస్తే బోడి మల్లయ్య అంటూ ప్రతిపక్ష పార్టీ నాయకులను చక్కగా విమర్శిస్తూ,, బాబోరి ప్రయోజనాలను కాపాడే రక్షణ కవచాలుగా వారు చూపిస్తున్న తెగువ,బాబుగారి కి దగ్గరగా వుండే బాబులను కూడా ముద్దు చేసే వారి మమతానురాగాలు wow ఇది అసలైన వార్తా..contd
— Naga Babu Konidela (@NagaBabuOffl) June 9, 2020
పత్రికల స్పిరిట్ అంటే..శభాష్...(ఒక్కోసారి జగమ్మోహన్ రెడ్డి గారే వీళ్ళకి కరెక్ట్ అని doubt వస్తుందేంటి)
— Naga Babu Konidela (@NagaBabuOffl) June 9, 2020
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments