NagaBabu : చిరంజీవి, పవన్‌ల జోలికొస్తే.. ఎవడైనా సరే తాటతీస్తా : నాగబాబు వార్నింగ్
Send us your feedback to audioarticles@vaarta.com
కొణిదెల నాగబాబు.. మెగా బ్రదర్స్‌లో ఒకరు. ఒడ్డూ, పొడుగు అంతా బాగున్నప్పటికీ ఎందుకో ఆయన హీరోగా క్లిక్ కాలేదు. కానీ నిర్మాతగా మాత్రం ఫర్వాలేదనిపించుకున్నారు. అయితే ఆరంజ్ సినిమా ఫెయిల్ కావడంతో అంతా పోయింది. జబర్దస్త్ కార్యక్రమం ద్వారా తిరిగి నిలదొక్కుకున్న ఆయన.. చిన్నా చితకా పాత్రలతో కొనసాగుతున్నారు. ఏది ఏలా వున్నప్పటికీ.. తన సోదరులు చిరంజీవి, పవన్ కల్యాణ్‌లపై మాత్రం ఆయన ఈగ వాలనిచ్చేవారు కాదు. ముందు నుంచి ఆయన తత్వం అంతే. ఈ క్రమంలోనే నాగబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. తన సోదరుల జోలికొస్తే ఎవరికైనా తాట తీస్తానని వార్నింగ్ ఇచ్చారు.
హైటెక్స్‌లో గ్రాండ్‌గా చిరు బర్త్ డే వేడుకలు:
మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలు హైదరాబాద్ హైటెక్స్‌లో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి మెగా హీరోలతో పాటు అభిమానులు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ.. అన్నయ్యతో తనది 62 ఏళ్ల అనుబంధమని, ఆయన పుట్టినరోజు మాకెప్పుడూ ప్రత్యేకమన్నారు. ఒక తమ్ముడికి నిర్మాతగా జీవితాన్ని ఇచ్చి చిరంజీవి నిలబెట్టారని.. పవన్ కల్యాణ్ డైరెక్టర్ అవుదామని అనుకున్నాడని కానీ హీరోగా ప్రోత్సహించింది అన్నయ్యేనని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను మార్చే దమ్మున్న వ్యక్తి పవన్ కల్యాణ్ అని.. అలాంటి వ్యక్తిని ఇచ్చింది చిరంజీవేనని నాగబాబు కొనియాడారు.
చిరు ఎందరికో బంగారు బాట పరిచారు:
మాతో పాటు అల్లు అర్జున్, చరణ్, వరుణ్, సాయి ధరమ్ తేపజ్, వైష్ణవ్, నిహారిక, శిరీష్ వీరిందరికి బంగారు భవిష్యత్ అందించింది చిరంజీవి గారేనని ఆయన అన్నారు. అన్నయ్య రుణం తీర్చుకోలేమని.. అలాంటి అన్నయ్యను కానీ, తమ్ముడు చిరంజీవిని కానీ ఎవరైనా విమర్శిస్తే గట్టిగా కౌంటరిస్తానని నాగబాబు వార్నింగ్ ఇచ్చారు. ఎవరైనా సరే తాటతీస్తానని.. అందులో ఏ డౌట్ లేదని తేల్చి చెప్పారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com