Nagababu:నీ** మొగుడు ఖర్చు పెట్టాడారా రూ.80 కోట్లు .. తమ్మారెడ్డికి విరుచుకుపడ్డా నాగబాబు , మధ్యలో వైసీపీని కెలికి
Send us your feedback to audioarticles@vaarta.com
ఆస్కార్ బరిలో నిలిచిన ఆర్ఆర్ఆర్ చిత్రం యావత్ భారతదేశానికి గర్వకారణంగా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఆస్కార్ అవార్డ్‌ను గెలవాలని అంతా కోరుకుంటున్నారు. ఇందుకోసం సోషల్ మీడియాలో తమ మద్ధతు సైతం తెలియజేస్తున్నారు. ఇలాంటి పరిస్ధితుల్లో దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆస్కార్ అవార్డ్ కోసం ఆర్ఆర్ఆర్ చిత్ర యూనిట్ ఖర్చు పెడుతున్న మొత్తంతో 8 సినిమాలు తీయొచ్చంటూ వ్యాఖ్యానించారు. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ చిత్ర నిర్మాణం కోసం రూ.600 కోట్ల బడ్జెట్ అయ్యిందని.. మళ్లీ ఇప్పుడు ఆస్కార్ దక్కించుకునేందుకు చిత్ర యూనిట్ రూ.80 కోట్లు ఖర్చు చేసిందన్నారు. విమాన టికెట్లు, అమెరికాలో బస, ఇతర ఖర్చుల కోసం అంత వెచ్చిస్తున్నారని.. ఈ మొత్తతం 8 సినిమాలు చేయొచ్చని తమ్మారెడ్డి చురకలంటించారు. దీనిపై నందమూరి, మెగా అభిమానులతో పాటు నెటిజన్లు భగ్గుమన్నారు. తెలుగు సినిమా అంతర్జాతీయ స్థాయికి వెళ్లడం ఇష్టం లేదా అంటూ వారు మండిపడుతున్నారు.
గర్వపడాల్సింది పోయి ఆ మాటలేంటీ :
దీనిపై ఇప్పటికే దిగ్గజ దర్శకుడు కే . రాఘవేంద్రరావు సైతం స్పందించారు. ఆర్ఆర్ఆర్పై తమ్మారెడ్డి వ్యాఖ్యలను తప్పుబట్టారు. తెలుగు సినిమాకు , తెలుగు సాహిత్యానికి, తెలుగు నటులకు వస్తున్న పేరును చూసి గర్వపడాలన్నారు. ఆర్ఆర్ఆర్ యూనిట్ రూ.80 కోట్లు ఖర్చు పెట్టారు అనడానికి నీ దగ్గర ఏమైనా లెక్కలున్నాయా అంటూ రాఘవేంద్రరావు మండిపడ్డారు. తాజాగా ఈ లిస్ట్‌లోకి మెగా బ్రదర్ నాగబాబు చేరారు. స్వతహాగానే కొంచెం దూకుడుగా వుండే నాగబాబు.. తనదైన శైలిలో తమ్మారెడ్డిపై విరుచుకుపడ్డారు.
మధ్యలో వైసీపీని తెచ్చిన మెగా బ్రదర్ :
భరద్వాజ పేరును ప్రస్తావించకుండా ‘‘ నీ.. మొగుడు ఖర్చు పెట్టాడారా రూ.80 కోట్లు.. ఆర్ఆర్ఆర్కి ఆస్కార్ కోసం (ఆర్ఆర్ఆర్ మీద చేసిన కామెంటుకు వై.సీ.పీ. వారి భాషలో సమాధానం)’’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అంతా బాగానే వుంది కానీ.. తమ్మారెడ్డిని తిట్టడానికి మధ్యలో వైసీపీ పేరును వాడుకోవడమే విడ్డూరంగా వుంది. మరి దీనిపై తమ్మారెడ్డి, వైసీపీ శ్రేణులు ఎలా రియాక్ట్ అవుతాయో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com