మెగా 150 మొబైల్ గేమ్ వచ్చేస్తుంది..!

  • IndiaGlitz, [Wednesday,January 04 2017]

మెగాస్టార్ చిరంజీవి న‌టించిన అత్యంత ప్ర‌తిష్టాత్మ‌క‌మైన చిత్రం ఖైదీ నెం 150. ఈ చిత్రం సంక్రాంతి కానుక‌గా ఈనెల 11న ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తుంది. ఈ సంద‌ర్భంగా ఖైదీ నెం 150 చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకెళ్లేందుకు అన్నిర‌కాలుగా ప్ర‌మోష‌న్స్ ప్లాన్ చేస్తున్నారు. బాలీవుడ్ స్టైల్ లో ప్ర‌మోష‌న్స్ చేసేందుకు గాను మొబైల్ గేమ్ ను కూడా లాంఛ్ చేస్తుంది.
ఈ గేమ్ కు సంబంధించి టీజ‌ర్ ను రిలీజ్ చేసారు. ఈ టీజ‌ర్ సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తుంది. ఖైదీ, అడ‌వి దొంగ‌, జ‌గ‌దేక‌వీరుడు అతిలోక సుంద‌రి, కొండ‌వీటి దొంగ గెట‌ప్స్ లో చిరంజీవి యానిమేష‌న్ పాత్ర‌ చేసే సాహ‌సాలు అభిమానుల‌ను విశేషంగా ఆక‌ట్టుకునేలా ఉన్నాయి. ఈనెల 9న ఈ గేమ్ మార్కెట్ లో రిలీజ్ కానుంది.