పవన్‌ను కలవడం నా లైఫ్‌లో హ్యాపీ మూమెంట్!
Send us your feedback to audioarticles@vaarta.com
టాలీవుడ్ కుర్ర హీరో నితిన్, రష్మిక మందన్నా నటీనటులుగా వెంకీ కుడుముల తెరకెక్కించిన చిత్రం ‘భీష్మ’ ఇటీవలే రిలీజ్ అయ్యింది. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘భీష్మ’ కలెక్షన్ల పరంగా గట్టిగానే దూసుకెళ్తున్నాడు. వాస్తవానికి సినిమా పోస్టర్లు, లుక్స్, టీజర్లతోనే అంచనాలు పెరిగిపోయాయ్.. అయితే.. ఈ సినిమాను చాలా సీరియస్‌గా తీసుకున్న నితిన్.. అనుకున్నట్లుగానే సక్సెస్ అయ్యాడని చెప్పుకోవచ్చు.
ఇదిలా ఉంటే.. ఈ సినిమాపై ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇప్పటికే పలువురు హీరోలు ఈ సినిమా బాగుందని కితాబిచ్చారు. అయితే తాజాగా.. ఈ చిత్ర బృందానికి జనసేన అధినేత, పవర్ స్టార్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా పవన్‌ను కలిసిన విషయాన్ని భీష్మ దర్శకుడు వెంకీ కుడుముల తన ట్విట్టర్ ఖాతా ద్వారా పంచుకున్నాడు. మరోవైపు నితిన్ కూడా ఈ ఫొటోలను షేర్ చేశాడు. నితిన్.. పవన్ భక్తుడు అన్న విషయం తెలిసిందే.
లైఫ్‌లో హ్యాపీ మూమెంట్ ఇదీ!
‘నా జీవితంలో అత్యంత సంతోషాన్నిచ్చే మూమెంట్ ఇది. పవర్‌స్టార్ పవన్ భీష్మ చిత్రం సక్సెస్ సాధించినందుకు ఆయన అభినందనలు తెలిపారు’ వెంకీ కుడుముల అని ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్‌కు పవన్‌ను కలిసినట్లున్న ఫొటోలను ఆయన షేర్ చేశాడు. ఈ ట్వీట్‌కు పవన్ వీరాభిమానులు, నితిన్ అభిమానులు పెద్ద ఎత్తున కామెంట్ చేస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments