Upasana:ఉపాసనకు ఊయల చేసింది వీళ్లే.. ఎవరు వీళ్లు, రామ్ చరణ్ భార్యపై అంత అభిమానమా..?
Send us your feedback to audioarticles@vaarta.com
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సతీమణి పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. అయితే దాదాపు 11 ఏళ్ల తర్వాత చరణ్ దంపతులు శుభవార్త చెప్పడంతో కుటుంబ సభ్యులు, సన్నిహితులు, అభిమానులు సంతోషంలో మునిగిపోయారు. అంతేకాదు.. నాటి బేబి షవర్ ఈవెంట్స్ చేస్తూ కుటుంబ సభ్యులు ముచ్చట తీర్చుకున్నారు. అలాగే ఉపాసనకు అరుదైన కానుకలతో ముంచెత్తారు. అయితే బిడ్డ పుట్టడానికి ముందే ‘‘ఊయల’’ను బహూకరించి ఉపాసనకు సర్ప్రైజ్ ఇచ్చారు ప్రజ్వల ఫౌండేషన్ నిర్వాహకురాలు. గతంలో ఎన్నో స్వచ్ఛంద సంస్థలకు ఉపాసన విరాళాలు అందించడంతో పాటు అండగా నిలిచారు. అలాంటి వాటిలో ఒకటైన ప్రజ్వల ఫౌండేషన్‌కు చెందిన కొందరు మహిళలు ఉపాసనకు ఈ ఊయలను గిఫ్ట్‌గా పంపారు. దీనిని మహిళలే స్వయంగా వారి చేతులతో చేశారు. సెక్స్ ట్రాఫికింగ్‌లో చిక్కుకున్న మహిళలను కాపాడి, వారికి తిరిగి జీవితాన్నిచ్చేందుకు ప్రజ్వల ఫౌండేషన్ కృషి చేస్తోంది.
12 రోజులు పాటు శ్రమించి ఊయల తయారీ :
అయితే ఉపాసనకు ఊయల చేసింది ఎవరు.. ఎంతమంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.. ఎన్ని రోజులు పట్టింది . ఇలాంటి విషయాలను తెలుసుకోవాలని నెటిజన్లు జల్లెడపడుతున్నారు. ఈ క్రమంలో https://indiaglitz.com/ ఎక్స్‌క్లూజివ్‌గా మీకు ఆ విషయాలు అందిస్తోంది. డిజైన్ , ఊయలకు సరైన కలప ఎంపిక, పాలిషింగ్ ఇలా మొత్తం పనికి పన్నెండు రోజులు పట్టిందని ప్రజ్వల ఫౌండేషన్‌లో ఆశ్రయం పొందుతున్న అసోంకు చెందిన ముస్కాన్ అనే మహిళ చెప్పింది. పలు కారణాల వల్ల జీవితంలో చితికిపోయిన ఆడవాళ్లు ఇక్కడ ఆశ్రయం పొందుతున్నారని, వారందరీ యోగ క్షేమాలను ఉపాసన చూసుకుంటున్నారని మరో మహిళ చెప్పింది. తమ కోసం ఇంత చేస్తున్న ఆమె గర్భం దాల్చడంతో ఉపాసనకు ఏదో ఒక బహుమతి ఇవ్వాలని నిర్ణయించుకుని ఊయల తయారీకి శ్రీకారం చుట్టామని చెప్పింది.
ఏ పండుగను ఉపాసన మరిచిపోరు :
ఏ పండుగ జరిగినా, ఉపాసన ఇంట్లో ఏదైనా శుభకార్యమైనా ఖచ్చితంగా ప్రజ్వల ఫౌండేషన్‌లో ఒక కార్యక్రమం నిర్వహిస్తారని ఆమె తెలిపింది. పండుగల సమయంలో బట్టలు, బహుమతులు, స్వీట్లను మాకోసం ఉపాసన పంపుతారని చెప్పింది. ఫౌండేషన్‌లో 200 నుంచి 300 మంది ఆడవాళ్లు ఆశ్రయం పొందుతున్నారని.. గతంలో ఏదైనా అనారోగ్య సమస్యలు, అత్యవసర పరిస్థితి ఎదురైతే ఆసుపత్రికి వెళ్లడానికి దాదాపు 30 నిమిషాల సమయం పట్టేదని, దీని వల్ల ఎంతో కష్టంగా వుందని ఆమె పేర్కొంది. ఈ విషయం ఉపాసన దృష్టికి వెళ్లగానే ఆమె మా అందరి కోసం 24 గంటలూ అందుబాటులో వుండేలా డాక్టర్, మెడికల్ సిబ్బంది, మందుల షాపును ఏర్పాటు చేశారని వెల్లడించింది. పదేళ్ల నుంచి ఉపాసన తమకు తెలుసునని.. కానీ ఆమె చేస్తున్న సాయంలో కొంచెం కూడా మార్పు రాలేదని అక్కడి మహిళలు చెబుతున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments