రోడ్డుపై పడివున్న సాయి తేజ్.. కాపాడింది ఇతనే: మంచినీళ్లు తాగించి, అంబులెన్స్‌కు ఫోన్
Send us your feedback to audioarticles@vaarta.com
సినీ నటుడు సాయిధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆయనను ఆసుపత్రికి తరలించడం.. పోలీసుల దర్యాప్తు ఈ వార్త తెలుగు నాట వైరల్ కావడం వెనువెంటనే జరిగిపోయింది. ఇక మెడికవర్ ఆసుపత్రికి మీడియా ఓబీ వ్యాన్లు, అభిమానులు, పోలీసులు పరుగులు తీశారు. ఆ కాసేటికే సాయిధరమ్ తేజ్ కుటుంబసభ్యులు ఆసుపత్రికి చేరుకున్నారు. ఇదంతా అందిరికీ తెలిసిన విషయమే కానీ.. ప్రమాదంలో తీవ్రంగా గాయపడి రోడ్డుపై పడివున్న సాయితేజ్‌ను గమనించి అతనిని లేపి అంబులెన్స్‌కు ఫోన్ చేసిన వ్యక్తి మీడియా ముందుకు వచ్చాడు. అతని పేరు అబ్ధుల్ ఫర్హాన్.
నిజాంపేటలోని సీఎంఆర్ షాపింగ్ మాల్ లో వ్యాలెట్ పార్కింగ్‌లో పనిచేస్తున్న అబ్దుల్ .. ఘటన జరిగిన రోజున విధులు ముగించుకొని తన స్నేహితుడు ఆసిఫ్‌తో కలిసి బైక్ పై వస్తున్నాడు. అదే సమయంలో అబ్దుల్ బైక్‌ను సాయిధరమ్ తేజ్ స్పోర్ట్స్ బైక్ ఓవర్ టేక్ చేసి ముందుకు వెళ్లి కిందపడింది. వెనుక వస్తున్న అబ్థుల్ వెంటనే అక్కడికి చేరుకుని సాయిధరమ్‌తేజ్‌ను పుట్‌పాత్‌పై కూర్చొబెట్టి, మంచినీళ్లు తాగించారు.
వెంటనే 108 కి ఫోన్ చేసి పిలిపించారు. అందేకాదు మాదాపూర్ పోలీసులకు కూడా సమాచారం ఇచ్చారు. సాయిధరమ్ తేజ్ ఫోన్ లాక్ ఓపెన్ చేసి వారి కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చేందుకు ప్రయత్నించారు. కానీ లాక్ ఓపెన్ కాలేదు. అలాగే ఆయన పర్సులో కూడా ఎలాంటి ఫోన్ నెంబర్లు దొరకకపోవడంతో పర్సును, హెల్మెట్ ను 108 సిబ్బందికి ఇచ్చారు.
శనివారం నాడు ఎస్ఐ ఫోన్ చేసి చెప్పేవరకు తాను కాపాడింది సినీ నటుడు సాయిధరమ్ తేజ్‌ను అని అబ్ధుల్ ఫర్హాన్ చెప్పాడు. అలాగే సాయిధరమ్ తేజ్ కు రోడ్డు ప్రమాదం ఎలా జరిగిందనే విషయాన్ని ఎస్ఐ తనను ఫోన్ లో అడిగి తెలుసుకొన్నట్టుగా అబ్దుల్ మీడియాకు చెప్పారు. రోడ్డు పై మట్టి, ఓవర్ స్పీడ్ వల్లే యాక్సిడెంట్ జరిగిందని వెల్డించాడు. ఘటన జరగగానే తాను స్పందించిన తీరుపై రాయదుర్గం పోలీసులు ఫోన్ చేసి అభినందించారు..అని ఫర్హాన్ తెలిపాడు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments