ఢిల్లీకి చేరిన ఎన్టీఆర్ ఫ్యాన్స్‌పై మీరా చోప్రా కేసు
Send us your feedback to audioarticles@vaarta.com
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ తనను వేధిస్తున్నారంటూ బాలీవుడ్ నటి మీరా చోప్రా హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. సూపర్ స్టార్ మహేశ్ బాబు అంటే ఇష్టమని.. జూనియర్ ఎన్టీఆర్ ఎవరో తెలియదని మీరా చెప్పడమే పెద్ద మిస్టేక్.! ఈ ఒక్క మాటను పట్టుకున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్ మీరాను దుమ్మెత్తి పోస్తున్నారు. తీవ్ర అసభ్య పదజాలంతో మెసేజ్‌లు చేయడం.. కొందరు అభిమానులు అయితే ఏకంగా చంపేస్తామని బెదిరించడం, గ్యాంగ్ రేప్ చేస్తామని ఈ విషయాలకు సంబంధించిన స్క్రీన్ షాట్లను జోడిస్తూ పోలీసులకు మీరా ఫిర్యాదు చేసింది. అభిమానుల అత్యుత్సాహం టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు పెద్ద తలనొప్పిగా మారింది.
కాగా ఇప్పటికే ఈ వ్యవహారం జాతీయ మహిళా కమిషన్ దాకా వెళ్లగా.. తాజాగా హైదరాబాద్ నుంచి ఢిల్లీకి కేసును బదిలీ చేయడం జరిగింది. ఇదిలా ఉంటే.. ఇప్పటికే హైదరాబాద్ పోలీసులు ఎనిమిది ఖాతాల నుంచే అసభ్యకరమైన సందేశాలు వచ్చినట్టు గుర్తించడం జరిగింది. అందులో భాగంగా వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు పోలీసులు కేసు నమోదు చేశారు. తాజాగా.. ‘67ఎ’ను కూడా ఈ కేసుకు జతచేశారు. అయితే ఫిర్యాదు చేసిన మీరా చోప్రా ప్రస్తుతం ఢిల్లీలో ఉండడంతో ఆ కేసును అక్కడికి బదిలీ చేస్తున్నట్టు హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు తెలిపారు. మరి ఈ కేసుపై ఢిల్లీ పోలీసులు ఎలా ముందుకెళ్తారో వేచి చూడాలి. అసలు ఇలా అసభ్యకర వ్యాఖ్యలు చేసిన ఎన్టీఆర్ ఫ్యాన్స్‌పై ఢిల్లీ పోలీసులు ఏం చేయబోతున్నారు..? ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు..? అని ఆ ఎనిమిది మందిలో టెన్షన్ వాతావరణం నెలకోంది. మరి ఈ వ్యవహారంపై ఎన్టీఆర్ ఇంకా రియాక్ట్ కాలేదు.. ఒక వేళ అయితే ఎలాంటి సమాధానం వస్తుందో వేచి చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments