తల్లి పాత్రలో మీనా...

  • IndiaGlitz, [Saturday,August 12 2017]

బాల‌నటిగా సినీ రంగ ప్ర‌వేశం చేసిన మీనా తర్వాత స్టార్ హీరోలంద‌రితో ఆడిపాడింది. పెళ్లి చేసుకున్న త‌ర్వాత సినిమా రంగం నుండి టీవీ రంగం వైపు అడుగులేసింది. బుల్లితెర‌పై బిజీ బిజీగా రాణించిన మీనా సినిమాల వైపు మ‌ళ్లీ దృష్టి సారించారు.
ఈసారి త‌ల్లి పాత్ర‌లో క‌న‌ప‌డ‌నుంది మీనా. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా శ్రీవాస్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా రూపొందుతున్న సంగ‌తి విదితమే. ఈ ఆగ‌స్టు 17 నుండి సెకండ్ షెడ్యూల్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ సినిమాలో శ్రీనివాస్ త‌ల్లి పాత్ర‌లో మీనా న‌టించ‌నుంద‌ని ఫిలింన‌గ‌ర్ వ‌ర్గాల స‌మాచారం. ప్లాష్ బ్యాక్‌లో వ‌చ్చే మీనా పాత్ర‌కు చాలా ప్రాముఖ్య‌త ఉంటుంద‌ని అంటున్నారు. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుంది.