Meena husband: విషాదం... సినీ నటి మీనా భర్త విద్యాసాగర్ కన్నుమూత
Send us your feedback to audioarticles@vaarta.com
సినీ పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. సీనియర్ హీరోయిన్ మీనా భర్త విద్యాసాగర్ మృతి చెందారు. గత కొంతకాలంగా ఊపిరితిత్తులకు సంబంధించిన అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో మంగళవారం విద్యాసాగర్ ఆరోగ్యం క్షీణించడంతో తుదిశ్వాస విడిచారు. ఆయన స్వస్థలం బెంగళూరు. ఆయన మీనాను 2009లో పెళ్లాడారు. ఈ దంపతులకు నైనికా అనే కుమార్తె వున్నారు. విద్యాసాగర్ రెండు ఊపిరితిత్తులు దెబ్బతినడం వల్ల ఆరోగ్యం క్షీణించినట్లుగా తెలుస్తోంది. పావురం మలమూత్రాల నుంచి వచ్చే గాలిని పీల్చడం వల్ల ఒక రకమైన అలర్జీ కారణంగా ఆయనకు ఈ వ్యాధి సోకినట్లుగా సమాచారం.
విద్యాసాగర్‌కు పూర్తిగా చెడిపోయిన ఊపిరితిత్తులు:
ఇకపోతే.. ఈ ఏడాది ప్రారంభంలో మీనాతో సహా ఆమె కుటుంబం మొత్తం కోవిడ్ బారినపడింది. ఆ సమయంలో వైరస్‌ను తన ఇంట్లో వుండనివ్వనని.. మీరంతా జాగ్రత్తగా వుండాలంటూ ఆమె ట్వీట్ చేశారు. కరోనా నుంచి అందరూ కోలుకున్నప్పటికీ.. మీనా భర్తను మాత్రం కోవిడ్ అనంతర ఆరోగ్య సమస్యలు చుట్టుముట్టాయి. దీంతో చెన్నై ఆళ్వార్ పేటలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. ఆ సమయంలోనే ఊపిరితిత్తుల మార్పిడి ఆపరేషన్ చేయాలని వైద్యులు సూచించారు. కానీ దాత దొరక్కపోవడంతో అప్పటి నుంచి విద్యాసాగర్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఈ క్రమంలో రోజు రోజుకీ ఆయన ఆరోగ్యం క్షీణించినట్లుగా తమిళ మీడియాలో కథనాలు వస్తున్నాయి. విద్యాసాగర్ మరణం పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.
నేడు విద్యాసాగర్ అంత్యక్రియలు:
కాగా.. 90వ దశకంలో మీనా దక్షిణాదిలో అగ్ర కథానాయికగా వెలుగొందారు. పెళ్లయిన తర్వాత కొన్నాళ్లు నటనకు దూరంగా వున్నప్పటికీ ఆ తర్వాత రియాలిటీ షోలకు జడ్జిగానూ, కొన్ని సినిమాల్లోనూ మీనా నటించారు. విద్యాసాగర్ అంత్యక్రియలు బుధవారం జరుగుతాయని సమాచారం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com