హీరోకి తల్లి పాత్రలో మీనా
Send us your feedback to audioarticles@vaarta.com
తొలుత బాలనటిగా తెరంగేట్రం చేసి.. తరువాత కాలంలో కథానాయికగానూ రాణించారు మీనా. సీతారామయ్యగారి మనవరాలు, ప్రెసిడెంట్ గారి పెళ్ళాం, చంటి, సుందరకాండ, అబ్బాయిగారు, బొబ్బిలి సింహం..ఇలా పలు చిత్రాల్లో ఆమె కథానాయికగా అలరించారు. ఇటీవల దృశ్యం చిత్రంలో ఇద్దరు ఆడపిల్లలకి తల్లిగా.. వెంకటేష్‌కి జోడీగా సందడి చేశారు. కాగా, ప్రస్తుతం మీనా సాక్ష్యం అనే చిత్రంలో నటిస్తున్నారు. బెల్లంకొండ శ్రీనివాస్, పూజా హెగ్డే జంటగా శ్రీవాస్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో మీనా ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు.
తాజాగా వినిపిస్తున్న కథనాల ప్రకారం.. ఇందులో మీనా కథానాయకుడు శ్రీనివాస్‌కి తల్లి పాత్రలో కనిపించనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. జగపతిబాబు, శరత్ కుమార్ ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది వేసవిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదివరకు మీనా.. బెల్లంకొండ సురేష్ నిర్మించిన మా అన్నయ్య చిత్రంలో కథానాయికగా నటించారు. ఇప్పుడు ఆయన తనయుడు శ్రీనివాస్ నటిస్తున్న చిత్రంలో ఆమె తల్లి పాత్రలో సందడి చేయనుండడం విశేషం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout