మీలో ఎవరు కోటీశ్వరుడు మూడో సిరీస్ ముగింపు..
Send us your feedback to audioarticles@vaarta.com
ఎక్కడో మారుమూల పల్లెటూరిలో ఉన్న ఒక సామాన్యుడు కూడా తన కలల్నీ ఆశల్నీ నిజం చేసుకునే అద్భుత అవకాశం కల్పించిన మీలో ఎవరు కోటీశ్వరుడు మూడో సిరీస్ ఈనెల 22న (ఆదివారం ఎపిసోడ్ తో) ముగుస్తోంది. జీవితంలో ఒక అద్భుతం జరగాలని, ఆ మరుపురాని సందర్భం కోసం ఎదురు చూసిన సామాన్యులకు సింహాసనం వేసిన ఈ షోలోని ప్రతి ఎపిసోడ్ దేనికదే ప్రత్యేకంగా నిలిచింది. ప్రేక్షకులకు ఉద్విగ్న క్షణాలతో పాటు..వేదిక పై గెలుచుకున్న పార్టిసిపెంట్ తో ఆనందక్షణాలను కూడా అందించింది.
సిల్వర్ స్ర్కీన్ పైన వరుస బ్లాక్ బస్టర్స్ తో హల్ చల్ చేస్తూ, స్మాల్ స్ర్కీన్ పైన కూడా అదే ఎనర్జీని కొనసాగించారు కింగ్ నాగార్జున. తనో పెద్ద స్టార్ లా కాకుండా, హాట్ సీట్ లో కూర్చున్న ప్రతి పార్టిసిపెంట్ ఇమీడియట్ గా కనెక్ట్ అయ్యేలా ఎంతో హుందాగా షోని నిర్వహించారు కింగ్ నాగార్జున. ఒక స్నేహితుడిలా, ఒక ఆప్తుడి లా మాటల్లోకి దించి, పార్టిసిపెంట్స్ ఎలాంటి బెరుకు లేకుండా ఎంతో చాకచక్యంగా ఆటలోకి తీసుకెళ్లడంలో నాగార్జున గారు చూపించే ఇంటెలిజన్స్ - ఈ ఆటకి లైవ్లీనెస్ తో పాటు ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది. జీవితాల్లోని ఎన్నో కొత్త కోణాలను, భావోద్వేగాలను స్మృశించి, ఊహించని పరిస్థితులకు అంతిమ సమాధానం లాంటి పరిష్కారాలను అందించిన మీలో ఎవరు కోటీశ్వరుడు తో ప్రేక్షకుల అనుబంధం అద్భుతమైన విజయాన్ని అందించింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com