మీలో ఎవరు కోటీశ్వరుడు సీజన్ 3 ప్రారంభం ఎప్పుడు...?
Send us your feedback to audioarticles@vaarta.com
టాలీవుడ్ కింగ్ నాగార్జున... మీలో ఎవరు కోటీశ్వరుడు తో సక్సెస్ సాధించి వెండితెర పైనే కాదు బుల్లితెర పై కూడా ఆకట్టుకోగలని నిరూపించి ప్రేక్షక హ్రుదయాల్లో చెరగని ముద్రవేశారు. నాగార్జున మీలో ఎవరు కోటీశ్వరుడు ప్రొగ్రామ్ కి యాంకర్ గా చేస్తున్నారన్న వార్త తెలిసినప్పటి నుంచి నాగ్ ఈ ప్రొగ్రామ్ లో పాల్గొనేవారిని ఎలా డీల్ చేస్తారు...? సక్సెస్ అవుతారా..? లేదా..? ఇలా చాలా మందికి చాలా ప్రశ్నలు. కానీ వారందరికీ తన ప్రొగ్రామ్ సక్సెస్ తో సమాధానం చెప్పారు.
ఇదే విషయం గురించి నాగ్ ని అడిగితే...ఈ ప్రొగ్రామ్ నన్ను చేయమన్నప్పుడు నేను చేయగలనా..లేదా అనే సందేహం నాకు కూడా ఉండేది. అయితే ఒక రోజు అమితాబ్ తో మాట్లాడుతున్నప్పుడు ఈ విషయం గురించి చెబితే..ఈ ప్రొగ్రామ్ చెయ్యి...చేస్తే నీలో చాలా మార్పు వస్తుందన్నారు. అంతే.. వెంటనే ఓకే అనేసాను. ఈ ప్రొగ్రామ్ ద్వారా రకరకాల మనసులను, వారి జీవితాలను దగ్గరి నుంచి చూసే అవకాశం లభించింది నిజంగా బిగ్ బి చెప్పినట్టే ఈ ప్రొగ్రామ్ నాలో చాలా మార్పు తీసుకువచ్చిందన్నారు నాగ్.
ఇక అసలు విషయానికి వస్తే....మీలో ఎవరు కోటీశ్వరుడు ఫస్ట్ సీజన్ కు చాలా మంచి స్పందన లభించింది. ఇప్పటి వరకు తన సినిమాలతో ఎంటర్ టైన్ చేసిన నాగ్...మీలో ఎవరు కోటీశ్వరుడు తో ఆడియోన్స్ హార్ట్ టచ్ చేసారు. రెండో సీజన్ కూడా మంచి స్పందన లభించింది. ఇక నౌ టైం ఫర్ మీలో ఎవరు కోటీశ్వరుడు సీజన్ 3. నాగ్ ప్రస్తుతం సొగ్గాడే చిన్ననాయన, కార్తీతో కలసి చేస్తున్న సినిమాలతో బిజీగా ఉన్నారు. ఈ రెండు చిత్రాల షూటింగ్ లను ఈ నెలాఖరుకు పూర్తి చేయనున్నారు. ఆతర్వాత అక్టోబర్ నుంచి మీలో ఎవరు కోటీశ్వరుడు సీజన్ 3 షూటింగ్ పాల్గొంటారట. మరి...మీలో ఎవరు కోటీశ్వరుడు సీజన్ 1, 2 లతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుని సీజన్ 3 తో ప్రేక్షకులకు ముందుకు వస్తున్న నాగ్ ఆల్ ద బెస్ట్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com