వారం ముందుగా 'మీలో ఎవరు కోటీశ్వరుడు'

  • IndiaGlitz, [Friday,December 02 2016]

పృథ్వీ, నవీన్‌చంద్ర హీరోలుగా, సలోని, శృతి సోధి హీరోయిన్లుగా శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌ ఇ.సత్తిబాబు దర్శకత్వంలో కె.కె.రాధామోహన్‌ నిర్మించిన ఫుల్‌ లెంగ్త్‌ ఎంటర్‌టైనర్‌ 'మీలో ఎవరు కోటీశ్వరుడు'. ఈ చిత్రాన్ని అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి డిసెంబర్‌ 16న విడుదల చేసేందుకు నిర్మాత కె.కె.రాధామోహన్‌ సన్నాహాలు చేస్తున్నారు.

ఈ సందర్భంగా నిర్మాత కె.కె.రాధామోహన్‌ మాట్లాడుతూ - ''పృథ్వీ, నవీన్‌చంద్ర హీరోలుగా ఇ.సత్తిబాబు ఔట్‌ అండ్‌ ఔట్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈనెలలోనే చిత్రాన్ని రిలీజ్‌ చెయ్యాల్సి వుండగా, ప్రస్తుతం అందరూ ఎదుర్కొంటున్న కరెన్సీ సమస్యను దృష్టిలో వుంచుకొని డిసెంబర్‌ 16న ఈ చిత్రాన్ని రిలీజ్‌ చెయ్యాలని నిర్ణయించాం. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి విడుదలైన ట్రైలర్స్‌ అందర్నీ విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఇటీవల విడుదలైన ఆడియో కూడా సూపర్‌హిట్‌ అయింది. తప్పకుండా మా బేనర్‌లో 'మీలో ఎవరు కోటీశ్వరుడు' మరో సూపర్‌హిట్‌ సినిమా అవుతుంది'' అన్నారు.

పృథ్వీ, నవీన్‌చంద్ర, సలోని, శృతి సోధి, జయప్రకాష్‌రెడ్డి, పోసాని కృష్ణమురళి, మురళీశర్మ, రఘుబాబు, ప్రభాస్‌ శ్రీను, చలపతిరావు, ధన్‌రాజ్‌, పిల్లా ప్రసాద్‌, గిరి, సన, విద్యుల్లేఖా రామన్‌, మీనా, నేహాంత్‌ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: శ్రీవసంత్‌, సినిమాటోగ్రఫీ: బాల్‌రెడ్డి పి., కథ, మాటలు: నాగేంద్రకుమార్‌ వేపూరి, కథా విస్తరణ: విక్రవమ్‌రాజ్‌, డైలాగ్స్‌ డెవలప్‌మెంట్‌: క్రాంతిరెడ్డి సకినాల, పాటలు: రామజోగయ్యశాస్త్రి, భాస్కరభట్ల, ఎడిటింగ్‌: గౌతమ్‌రాజు, ఆర్ట్‌: కిరణ్‌కుమార్‌, ఫైట్స్‌: రియల్‌ సతీష్‌, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: ఎం.ఎస్‌.కుమార్‌, సమర్పణ: శ్రీమతి లక్ష్మీ రాధామోహన్‌, నిర్మాత: కె.కె.రాధామోహన్‌, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఇ.సత్తిబాబు.

More News

డిసెంబర్ 16న 'నాన్న - నేను - నా బాయ్ ఫ్రెండ్స్' విడుదల

తండ్రీ కూతుళ్ల మధ్య స్వచ్ఛమైన అనుబంధాన్ని చెప్పిన చిత్రాలన్నీ ఇప్పటిదాకా బాక్సాఫీసును దర్జాగా కొల్లగొట్టినవే. ఆ కోవలోకి చేరడానికి ముస్తాబవుతోన్న తాజా చిత్రం `నాన్న - నేను - నా బాయ్ ఫ్రెండ్స్`. ఈ నెల 16న విడుదల కానుంది. లక్కీ మీడియా నిర్మిస్తున్న చిత్రమిది. బెక్కం వేణుగోపాల్ (గోపి) నిర్మాత. భాస్కర్ బండి దర్శకత్వం వహించారు.

సూర్య సింగం 3 రిలీజ్ వాయిదాకి కార‌ణం ఇదే..!

సూర్య హీరోగా న‌టిస్తున్న‌తాజా చిత్రం సింగం 3. సింగం సిరీస్ లో మూడో సినిమాగా వ‌స్తున్న సింగం 3 పై అటు త‌మిళ్, ఇటు తెలుగులో ఊహించిన‌ట్టుగానే భారీ క్రేజ్ ఏర్ప‌డింది. హ‌రి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన‌ ఈ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ లో సూర్య స‌ర‌స‌న అనుష్క‌, శృతిహాస‌న్ న‌టించారు.

వంగ‌వీటి సినిమా పై కేసును కోట్టేసిన కోర్టు..!

సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రామ్ గోపాల‌వ‌ర్మ తెర‌కెక్కిస్తున్న తాజా చిత్రం వంగ‌వీటి. ఈ చిత్రాన్ని రామ‌దూత క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై దాస‌రి కిర‌ణ్ కుమార్ నిర్మిస్తున్నారు.

న్యూ టెక్నాల‌జీతో ఖైదీ నెం 150 ఆడియో రిలీజ్..!

మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తున్న 150 చిత్రం ఖైదీ నెం 150 సంక్రాంతికి ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతుంది. ఈ భారీ చిత్రాన్ని మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ బ్యాన‌ర్ పై ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్నారు.

వంగ‌వీటిలో క‌మ్మ - కాపు పాట తొల‌గింపు..!

సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ తెర‌కెక్కించిన మ‌రో సంచ‌ల‌న చిత్రం వంగ‌వీటి. ఈ చిత్రాన్ని రామ‌దూత క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై దాస‌రి కిర‌ణ్ కుమార్ నిర్మిస్తున్నారు.  రాంగోపాల్‌వ‌ర్మ తెర‌కెక్కిస్తోన్న వంగ‌వీటి సినిమా వాస్త‌వాల‌కు విరుద్ధంగా ఉందంటూ వంగ‌వీటి రాధ హైకోర్టులో పిటిష‌న్ వేసారు.