ఆపర్ట్ లవ్ గురించి చెప్పే 'మీకు మీరే మాకు మేమే'
Send us your feedback to audioarticles@vaarta.com
తరుణ్ శెట్టి, అవంతిక, కిరిటీ దామరాజు, జెన్ని, భరణ్ ప్రధాన తారాగణంగా నకమా ప్లానెట్ గ్రీన్ స్టూడియోస్ బ్యానర్ పై రూపొందుతోన్న చిత్రం మీకు మీరే మాకు మేమే`. హుస్సైన్ షా కిరణ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం మంగళవారం హైదరాబాద్ లో జరిగింది. బిగ్ సీడీని, ఆడియో సీడీలను అల్లు అరవింద్ విడుదల చేశారు. తొలి ఆడియో సీడీని అందుకున్నారు. థియేట్రికల్ ట్రైలర్ ను సుకుమార్ థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేశారు.
ఇంకా ఈ కార్యక్రమంలో లగడపాటిశ్రీధర్, పి.రామ్మోహన్, దర్శకుడు హుస్సైన్ షా కిరణ్, తరుణ్ శెట్టి, అవంతిక, కిరిటీ, జెన్ని, శ్రవణ్, సాయివినయ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా...
అల్లు అరవింద్ మాట్లాడుతూ `` లవ్‌కి అర్థం #ఎంటుఎం అని ఈ సినిమాతో ప్రూవ్ చేయాలని, సోషల్ మీడియా వల్ల ఓ సినిమా ఆడుతుందని ఈ సినిమా నిరూపించాలి. అందుకు మీడియా బాగా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. హస్సైన్ డైరెక్ట్ చేసిన షార్ట్ ఫిలింస్ చూసి థ్రిల్ ఫీలయ్యాను. షార్ట్ ఫిలింస్ చూడకముందు ఏడెనిమిది మంది కుర్రాళ్ళు ఓ గ్రూప్ గా ఏర్పడి ఉద్యోగాలు వదిలేసి, సినిమాల్లో ఏదో చేయాలనే వారి ఉత్సాహం నాకు నచ్చింది. ఇక దర్శకుడు హుస్సైన్ షాకు నా బ్యానర్ లో మూడో సినిమా చేసే అవకాశం ఇస్తున్నాను. ఈ కుర్రాళ్ళ గ్యాంగ్‌లో మంచి ఫైర్ ఉంది. ఆ ఫైర్‌ను ఎంకరేజ్ చేయాలని వారి తల్లిదండ్రులను కోరుకుంటున్నాను`` అని చెప్పారు.
సుకుమార్ మాట్లాడుతూ ``ఆర్య2 సమయంలో హుస్సైన్ ఓ చిన్న పాత్ర కోసం నన్ను కలిశాడు. అలా చిన్న చిన్న పాత్రలు చేస్తూ అక్కడ దర్శకత్వం ఎలా చేస్తారో చూస్తూ వచ్చి దర్శకత్వం గురించి తెలుసుకున్నాడు. తన దగ్గర నుండే నాన్నకు ప్రేమతో..కథను కాపీ చేశాను. భవిష్యత్తులో మంచి ప్రామిసింగ్ డైరెక్టర్ అవుతాడు. నా బ్యానర్లో అతనికి నెక్ట్స్ మూవీ అవకాశం ఇస్తున్నాను`` అని తెలిపారు.
చిత్ర దర్శకుడు హుస్సైన్ షా కిరణ్ మాట్లాడుతూ `ఈసినిమా ఫ్యామిలీతో సంబంధం లేని అల్లు అరవింద్‌గారు అందించిన సపోర్ట్ ని మర్చిపోలేను. ఆయనకు మాటలతో చెప్పి రుణం తీర్చుకోలేను. ఫీచర్ ఫిలింస్ గురించి నాకేమీ తెలియవు. అరవింద్ గారు ప్రతి అడుగులో మాకు సపోర్ట్ గా నిలిచారు. మాకెలా చేయాలో ఆయన నేర్పించలేదు. మా తప్పులను మాత్రం ఎత్తి చూపేవారు. అలా ఆయన మాకు సినిమా గురించి నేర్పించారు. సుకుమార్ గారు నాన్నకు ప్రేమతో సినిమాలో చిన్న పార్ట్ చెబితే ఆ పార్ట్ ను ఒకటిన్నర సంవ్సతరం డెవలప్ చేశారు. కానీ మూలకథ క్రెడిట్ ను నాకు ఇచ్చారు. ఈ సినిమా విషయాకి వస్తే ఇది స్టోరీ ఆఫ్ ఆఫ్టర్ లవ్‌కు సంబంధించిన కథ. మంచి రొమాంటిక్ ఎంటర్టైనర్. హౌ టు కీప్ ద రొమాన్స్ అలైవ్ అని చెప్పే సినిమా ఇది. ప్రేమలో పడ్డ తర్వాత జరిగే ప్రతి పరిణామాన్ని స్వీట్‌గా చూపించాం. శ్రవణ్‌ని టార్చర్ పెట్టి ఈ సంగీతం చేయించాను. ఎక్సలెంట్ మ్యూజిక్ ఇచ్చాడు. తప్పకుండా అందరికీ నచ్చుతుంది`` అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న అతిథులు పి.రామ్మోహన్, లగడపాటి శ్రీధర్ చిత్రయూనిట్ ను అభినందించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments