'నాన్నకు ప్రేమతో' రచయిత హుస్సైన్ షా కిరణ్ దర్శకుడిగా 'మీకు మీరే మాకు మేమే''
Send us your feedback to audioarticles@vaarta.com
ఇటీవల సంక్రాంతి బరిలో విడుదలయ్యిన నాన్నకు ప్రేమతో చిత్ర రచయిత హుస్సైన్ షా కిరణ్ దర్శకుడిగా మారి మీకు మీరే మాకు మేమే అనే చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం తో తరుణ్ షెట్టి, అవంతిక మిష్రా లు హీరోహీరోయిన్స్ గా పరిచయం అవుతున్నారు. కిరిటి దామరాజు, జెన్ని, భరణ్ లు ముఖ్యపాత్రల ద్వారా కనిపించనున్నారు. ఆన్లైన్ లో షాడో, ఒంటి గంట అనే చిత్రాలు తీసి ఫ్యామస్ అయిన నకామా ప్లానెట్ గ్రీన్ స్టూడియోస్ ఫుల్‌ప్లెడ్జ్ నిర్మాణం చెపట్టారు. శ్రవన్ అందించిన ఆడియోని అతి త్వరలో విడుదల చేసి అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి ఫిబ్రవరి లో చిత్రాన్ని విడుదల చేయనున్నారు.
ఈ సందర్బంగా చిత్ర దర్శకుడు హుస్సైన్ షా కిరణ్ మాట్లాడుతూ.. తెలుగు సినిమా ఆల్‌టైం క్లాసిక్ మిస్సమ్మ చిత్రం అంటే నాకు చాలా ఇష్టం ఆ చిత్రం లోని ఓ సీన్ ని ఇన్స్పైర్ అయ్యి ఈచిత్రాన్ని చేశాను. అందుకే మిస్సమ్మ చిత్రానికి గౌరవం ఇస్తూ ఆ చిత్రంలోని బిట్ సాంగ్ లిరిక్ ని మీకు మీరే మాకు మేమే అనే టైలిల్ ని పెట్టాము. మా చిత్రం అందరికి నచ్చుతుంది. చక్కటి ప్రేమ కథ అందులో చిన్న ఫీల్ తో కథనం వుంటుంది. అంతేకాదు ఎంటర్టైన్మెంట్ ఫుల్ గా వుంటుంది. ప్రతి సీన్ మన పక్కనే జరుగుతున్నట్టుంటుంది. ఈచిత్రం ఆడియో ని అతి త్వరలో విడుదల చేసి ఫిబ్రవరి లో చిత్రాన్ని విడుదల చేస్తున్నాము.. అని అన్నారు
నటీనటులు.. తరుణ్ షెట్టి(నూతన పరిచయం), అవంతిక మిష్రా, కిరిటి దామరాజు, జెన్ని(నూతన పరిచయం), భరణ్ తదితరులు..
సంగీతం.. శ్రవణ్ , సినిమాటోగ్రఫి..సూర్య వినయ్ , ఎడిటర్.. మార్తాండ్.కె.వెంకటేష్ , పి.ఆర్.వో.. తేజస్వి సజ్జా , ఆర్ట్.. అభిషెక్, మనీషా సత్యవోలు, రాం. , ఎగ్సిక్యూటివ్ ప్రోడ్యూసర్.. కార్తిక్ వంశీ తాడేపల్లి , ప్రోడ్యూసర్.. నకామా ప్లానెట్ గ్రీన్ స్టూడియోస్ , డైరక్టర్.. హుస్సైన్ షా కిరణ్
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com