Meeku Matrame Chepta Review
రీసెంట్ టైమ్స్‌లో చిన్న చిత్రంగా విడుదలై పెద్ద విజయాన్ని సాధించిన చిత్రాల్లో `పెళ్ళిచూపులు` ఒకటి. ఈ చిత్రంతో తరుణ్ భాస్కర్ హీరోగా, విజయ్ దేవరకొండ హీరోగా గుర్తింపును సంపాదించుకున్నారు. ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. హీరో విజయ్ దేవరకొండ నిర్మాతగా మారాడు. కింగ్ ఆఫ్ ది హిట్ ఎంటర్‌టైన్‌మెంట్ అనే బ్యానర్‌ను స్టార్ట్ చేసి తొలి చిత్రంగా `మీకు మాత్రమే చెప్తా` సినిమాను నిర్మించాడు. ఆసక్తికరమైన విషయమేమంటే ఈ చిత్రంలో హీరోగా తరుణ్‌భాస్కర్‌ని నటింప చేయడమే. సమీర్ సుల్తాన్ అనే డెబ్యూ డైరెక్టర్ తెరకెక్కించిన ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేర ఆకట్టుకుందో తెలుసుకోవాలంటే సినిమా కథలోకి వెళదాం..
కథ:
రాకేష్(తరుణ్ భాస్కర్) ఓ టీవీ ఛానెల్‌లో హోస్ట్‌గా పనిచేస్తుంటాడు. రాకేష్‌కి తన గర్ల్‌ఫ్రెండ్‌తో పెళ్లి కుదురుతుంది. ప్రేమ కోసం తనకు ఎలాంటి చెడు అలవాట్లు లేవని రాకేష్ ఆమెతో అబద్ధం చెబుతాడు. దాన్ని అలాగే కంటిన్యూ చేస్తుంటాడు. ఇద్దరి మధ్య చిన్న చిన్న గొడవలు అయినా, చివరకి పెళ్లి చేసుకోవడానికి ఇద్దరూ సిద్ధపడతారు. అయితే ఓ సినిమా షూట్‌లో రాకేష్ చేసిన చిన్న పాటి బూతు వీడియో నెట్‌లో లీక్ అవుతుంది. దాంతో ఏం చేయాలో తెలియక తన స్నేహితుడు కామేష్(అభినవ్ గోమటం) సహాయంతో ఆ వీడియోను డిలీట్ చేయాలనుకుంటాడు. ఆ క్రమంలో రాకేష్ పడే ఇబ్బందులు ఏంటి? వీడియోను డిలీట్ చేశారా? చివరకు రాకేష్‌కి తన గర్ల్‌ఫ్రెండ్‌తో పెళ్లి జరిగిందా? లేదా? అసలు ఆ వీడియోను అప్‌లోడ్ చేసిందెవరు? అనే సంగతి తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
సమీక్ష:
సోషల్ మీడియాలో చాలా సమస్యలు వస్తుంటాయి. అలాంటి వాటిలో ఓ చిన్న సమస్యను తీసుకుని ఎంటర్‌టైనింగ్ పంథాలో సినిమా చేయడానికి దర్శక నిర్మాతలు సన్నాహాలు చేశారు. ముఖ్యంగా తరుణ్ భాస్కర్‌ను హీరోగా చేసి సినిమాను నిర్మించడం అంటే గొప్ప విషయమే. ఆ విషయంలో విజయ్ దేవరకొండను అభినందించాలి. కొత్త దర్శకుడు షమీర్‌ను నమ్మి విజయ్ సినిమాను నిర్మించాడు. సినిమాను ఏదో సీరియస్‌గా కాకుండా కామెడీ పంథాలో చెప్పే ప్రయత్నం చేశాడు. తరుణ్ భాస్కర్ దర్శకుడిగా మెప్పించాడు. తాజాగా హీరోగా కూడా మెప్పించాడు. తనదైన కామెడి టైమింగ్‌ను నటనకు జోడించాడు. తరుణ్‌కి అభినవ్ గోమటం యాడ్ అయ్యాడు. సినిమాలో ఎంటర్‌టైన్‌మెంట్ పరంగా చూస్తే.. అభినవ్ గోమటం పాత్ర చాలా కీలకంగా ఉంది. తనదైన నటనతో కామెడీ పండించాడు. సినిమాను అతని కోణంలో ఓపెన్ చేస్తారు. మధ్య మధ్య ఎవరికీ చెప్పకండి అంటూ అతనే అందరికీ హీరోకి సంబంధించిన సీక్రెట్‌ను రివీల్ చేయడం.. హీరో తన గురించి తాను చెప్పుకోవడం స్టార్ట్ చేయగానే అభినవ్ నటన బావుంది. ఇక అనసూయ పాత్ర పరిమితంగానే ఉన్నా.. చక్కగా ఉంది. ఆమె తన పాత్రకు న్యాయం చేసింది. ఇక సినిమాలో తరుణ్ గర్ల్ ఫ్రెండ్, అభినవ్ గర్ల్‌ఫ్రెండ్స్‌గా నటించిన అమ్మాయిలు వారి పాత్రలకు న్యాయం చేశారు. సాధారణంగా అమ్మాయిలు తాము ప్రేమించే అబ్బాయిలపై చూపించే శ్రద్ధ ఓసారి అనుమానంగా అనిపిస్తుంది. ఆ సందర్భంలో అబ్బాయిలు అబద్ధాలు చెప్పడం అనే కాన్సెప్ట్‌కి సోషల్ మీడియా అనే అంశాన్ని జోడించి డైరెక్టర్ షమీర్ చక్కగా సినిమా రూపంలో చూపించాడు. సపరేట్ కామెడీ ట్రాక్ అంటూ లేకుండా తరుణ్, అభినవ్ పాత్రలతోనే కామెడీని క్రియేట్ చేశాడు. శివకుమార్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఓకే. మదన్ గుణదేవా సినిమాటోగ్రఫీ బావుంది. ఓకే పాయింట్ చుట్టూ సినిమాను తిప్పడంతో సినిమా ల్యాగ్‌గా అనిపిస్తుంది. ఫస్టాఫ్ కంటే సెకండాఫ్ సినిమాను సాగదీసినట్లు అనిపిస్తుంది. అయితే సందర్భానుసారం వచ్చే కామెడీ సన్నివేశాలను ప్రేక్షకుడు ఎంజాయ్ చేస్తాడనంలో సందేహం లేదు.
బోటమ్ లైన్: మీకు మాత్రమే చెప్తా...ఆకట్టుకునే సిచ్యువేషనల్ కామెడీ
Read Meeku Matrame Chepta Review in English
- Read in English