‘మీకు మాత్రమేచెప్తా’ నవంబర్1న రిలీజ్

  • IndiaGlitz, [Thursday,October 03 2019]

హీరో విజయ్ దేవరకొండ నిర్మాతగా కింగ్ ఆఫ్ ద హిల్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై తీసిన తొలి చిత్రం.. ‘మీకు మాత్రమే చెప్తా’ రిలీజ్ కు రెడీ అయింది.. తరుణ్ భాస్కర్, అభినవ్ గోమటం,అనసూయ భరద్వాజ్, వాణి భోజన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ మూవీని షమ్మీర్ సుల్తాన్ డైరెక్ట్ చేసారు.ఫన్ ఎంటర్ టైనర్ గా రాబోతున్న ఈ మూవీని నవంబర్ 1న రిలీజ్ కాబోతుంది..

ఈ సందర్భంగా నిర్మాత వర్థన్ దేవరకొండ మాట్లాడుతూ: ఇప్పటి వరకు రిలీజ్ అయిన టీజర్, రెండు సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. కాలేజ్ మీట్స్ తో టీం బిజీ బిజీ గా ఉంది.‘మీకు మాత్రమే చెప్పా’ కాన్సెప్ట్ ఎంత కనెక్ట్ అయ్యిందో కాలేజ్ మీట్స్ లో వచ్చిన రెస్సాన్స్ తో తెలుస్తుంది.మంచోడు అనే ఇమేజ్ ని కాపాడుకునేందుకు ప్రతి మనిషి ప్రయత్నిస్తుంటాడు.

ఆ ఇమేజ్ ని డామేజ్ చేసే చిన్న తప్పును దిద్దుకునే ప్రయత్నంలో ఎంత కామెడీ పండిందనేది నవంబర్ 1న తెరమీద చూడబోతున్నారు. యూత్ కి కనెక్ట్ అయ్యే విధంగా ఉన్న ఈ కాన్సెప్ట్ ని అందరూ యాక్పెప్ట్ చేస్తారనే నమ్మకం ఉంది.చిన్న పాయింట్ చుట్టూ అల్లుకున్న మంచి హిలేరియస్ ఎంటర్టైనర్ ఇది.ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నీ చివరి దశలో ఉన్నాయి.అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని నవంబర్ 1న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం.

‘‘మీకు మాత్రమే చెప్తా’’ లో తరుణ్ భాస్కర్, అభినవ్ గోమటం, అనసూయ భరద్వాజ్, వాణి భోజన్ ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా.. పావని గంగిరెడ్డి, నవీన్ జార్జ్ థామస్, అవంతిక మిశ్రా, వినయ్ వర్మ,జీవన్ ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

More News

గోపీచంద్‌-తమన్నాచిత్రం ప్రారంభం

మ్యాచోస్టార్‌ గోపీచంద్‌ హీరోగా మాస్‌ డైరెక్టర్‌ సంపత్‌ నంది దర్శకత్వంలో 'యు టర్న్‌'లాంటి సూపర్‌హిట్‌ చిత్రాన్ని అందించిన శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ (ప్రొడక్షన్‌ నెం. 3)

దిల్ రాజు చేతుల మీదుగా ‘అది ఒక ఇదిలే’ ట్రైలర్ రిలీజ్

850 సినిమాలకు డ్యాన్స్ మాస్టర్ గా పనిచేసిన సీనియర్ మోస్ట్ కొరియోగ్రాఫర్ స్వర్ణ మాస్టర్ దర్శకురాలిగా మారారు.

ఆ పాత్ర‌కు చిరు ప్రాణం పోశారు: రాజ‌మౌళి

స్వాతంత్ర్య స‌మ‌ర‌యోధుడు ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి జీవితగాథ‌ను ఆధారంగా చేసుకుని తెర‌కెక్కిన చిత్రం `సైరా న‌ర‌సింహారెడ్డి`.

'శ్రీవిష్ణు' హీరోగా 'పీపుల్ మీడియా ఫ్యాక్టరీ,అభిషేక్ అగర్వాల్  ఆర్ట్స్' చిత్రం

ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంయుక్తంగా ఓ చిత్రాన్ని నిర్మించనున్నాయి.

'మీనబజార్'., ఫస్ట్ లుక్, టీజర్ లాంచ్ చేసిన నిర్మాత సి.కళ్యాణ్

డబ్ల్యు డబ్ల్యు డబ్ల్యు. మీనబజార్., టీజర్, ఫస్ట్ లుక్ లాంచ్ కార్యక్రమం మంగళవారం జరిగింది. హీరో మధు సుధన్, హీరోయిన్ శ్రీజిత ఘోష్,