కలెక్షన్ కింగ్ డా.మోహన్ బాబును అభినందించిన మీడియా మొఘల్ రామోజీరావు
Send us your feedback to audioarticles@vaarta.com
ఆరు వందలకు పైగా చిత్రాల్లో నాయకుడు, ప్రతి నాయకుడు, నిర్మాతగా ఇలా అన్ని విభాగాల్లో తనదైన ప్రత్యేకతను చాటుకున్న కలెక్షన్ కింగ్ డా.మోహన్ బాబు నట జీవితంలో నాలుగు దశాబ్దాలను పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా బ్రిటన్ పార్లమెంట్ లో మోహన్ బాబు సినిమాల్లో బెస్ట్ డైలాగ్స్ తో రీసెంట్ గా బెస్ట్ డైలాగ్స్ అనే పుస్తకాన్ని విడుదల చేశారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని మీడియా మొఘల్ రామోజీరావు మోహన్ బాబును ప్రశంసిస్తూ ఓ లేఖను పంపారు. డైలాగ్ కింగ్ గా తెలుగు ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న హీరో నిజజీవింతంలోనూ హీరో అనదగ్గ వ్యక్తిత్వాన్ని కలిగి ఉన్నారు. మీరింకా మరెన్నో గౌరవాలను పొందాలని కోరుకుంటున్నాని ఆయన కాంక్షించారు.
రామోజీరావు వంటి వ్యక్తి నుండి ఇటువంటి ప్రశంసలు అందుకోవడంతో మోహన్ బాబు చాలా హ్యాపీగా ఉన్నారు. రామోజీరావుగారు నాకు ఇన్ స్పిరేషన్, ఆయనలాంటి వ్యక్తి నన్ను రియల్ హీరో అనడంతో కళ్ళలో నీళ్ళు తిరిగాయి. ఆయన ప్రశంసలను మరచిపోలేను. జీవితంలో ఇంకా ఎన్నెన్నో సాధించాలనుకుంటున్నానని ట్విట్లర్ లో తెలియజేసిన మోహన్ బాబు, డైలాగ్ బుక్ కు ముందు మాట రాసిన నందమూరి బాలకృష్ణకు ప్రత్యేక ధన్యవాదాలను కూడా తెలియజేశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com