మీడియా జీవితాల్ని నాశనం చేసింది - పూరి జగన్నాథ్
Send us your feedback to audioarticles@vaarta.com
డ్రగ్స్ కేసులో సిట్ అధికారుల ముందు హాజరయ్యారు పూరి జగన్నాథ్. 11 గంటల పాటు విచారణ సాగింది. విచారణ అనంతరం పూరి జగన్నాథ్, ఎవరితో మాట్లాడకుండా ఇల్లు చేరుకున్నాడు. అనంతరం ట్విట్టర్లో ఓ వీడియో పోస్ట్ చేశారు. ఈ వీడియోలో పూరి తన అభిప్రాయాలను తెలియజేశారు. సిట్ అధికారుకు పూర్తిగా సహకరించాను. నేను బాధ్యత గల వ్యక్తిని. అసాంఘిక కార్యకలాపాలను ఎప్పటికీ చేయను. డగ్స్ అయినా, మరేదైనా కావచ్చు. సిట్ అధికారులు మళ్ళీ రమ్మన్నా కూడా వెళ్లడానికి నేను సిద్ధంగా ఉన్నాను.
నాకు పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ఎంతో గౌరవం. వారిపై ఎన్నో సినిమాలు తీశాను. అలాగే జర్నలిస్టులన్నా నాకెంతో ఇష్టం. వారిపై ప్రేమతో ఇజం సినిమా తీశాను. జర్నలిస్ట్ మిత్రులను వన్ టు వన్ కలుస్తుంటాను. వారితో కాఫీ తాగుతూ మాట్లాడుతుంటాను. అంత క్లోజ్‌గా ఉండేవారు. కానీ సమయం రాగానే..నాపై నిజం ఏంటో తెలియకపోయినా అర్ధగంట స్టోరీలు రాసేశారు. మా అమ్మ, భార్య, పిల్లలు, అన్నదమ్ములు అందరూ ఏడుస్తున్నారు. నేనే కాదు, చాలా మంది ఫ్యామిలీలు అలాగే ఉన్నాయి. మీడియాపై బాధగా ఉంది. రేపు మళ్ళీ కలుస్తాం. కానీ చాలా డిస్ట్రబ్ చేసింది. ఏదైనా ఉంటే రేపు సిట్ ఆఫీసర్లు డిసైడ్ చేస్తారు అంటూ పూరి తెలిపారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com