కాసులు కురిపించిన సమ్మక్క-సారక్క జాతర.. హుండీ ద్వారా ఎంత ఆదాయమంటే..?
Send us your feedback to audioarticles@vaarta.com
ఆసియాలో అతిపెద్ద గిరిజన జాతర అయిన ‘‘సమ్మక్క సారక్క జాతర’’ విజయవంతంగా ముగిసిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 16 నుంచి 19 వరకు జరిగిన ఈ మహోత్సవానికి దాదాపు కోటి మందికి పైగా భక్తులు హాజరయ్యారని అంచనా. అమ్మవార్లను దర్శించుకుని.. ఎవరి స్తోమత మేరకు వారు మొక్కులు చెల్లించుకున్నారు. ఇందులో బంగారు ఆభరణాలు, స్వదేశీ, విదేశీ నోట్లు కానుకలుగా సమర్పించారు. అలా మొత్తంగా రూ.11,45,34,526 ఆదాయం సమకూరినట్లు అధికారులు తెలిపారు.
జాతర నేపథ్యంలో సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు గద్దెల వద్ద దేవాదాయ శాఖ హుండీలు ఏర్పాటు చేసింది. జాతర ముగిసిన తర్వాత వాటిని హనుమకొండలోని టీటీడీ కల్యాణ మండపానికి చేర్చారు. వీటి లెక్కింపు గత నెల 23న ప్రారంభించగా, ఈనెల 7న ముగిసింది. స్వదేశీ నగదు రూ.11,45,34,526, మిశ్రమ బంగారం 631 గ్రాములు, 48.350 కిలోల వెండి వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. అయితే వివిధ దేశాల నుంచి కరెన్సీల విలువ కట్టాల్సి ఉందని తెలిపారు.
2020లో రూ. 11.64 కోట్ల ఆదాయం రాగా, ఈసారి మాత్రం 11.45 కోట్లు మాత్రమే వచ్చిందని చెప్పారు. గత జాతరలో 1.639 కిలోల మిశ్రమ బంగారం రాగా, ఈసారి 631 గ్రాములు వచ్చింది. అదేవిధంగా 2020లో 53.454 కిలోల వెండి రాగా, ఈసారి 48.350 కిలోలు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. సమ్మక్క సారక్క జాతర చరిత్రలోనే తొలిసారిగా ఈ-హుండీ ఏర్పాటు చేశారు. క్యూఆర్ కోడ్ ఆధారంగా పనిచేసే ఈ హుండీకి మంచి స్పందన వచ్చింది. దీని ద్వారా రూ. 3 లక్షలు సమకూరినట్లు అధికారులు వెల్లడించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments