కాసులు కురిపించిన సమ్మక్క-సారక్క జాతర.. హుండీ ద్వారా ఎంత ఆదాయమంటే..?

  • IndiaGlitz, [Wednesday,March 09 2022]

ఆసియాలో అతిపెద్ద గిరిజన జాతర అయిన ‘‘సమ్మక్క సారక్క జాతర’’ విజయవంతంగా ముగిసిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 16 నుంచి 19 వరకు జరిగిన ఈ మహోత్సవానికి దాదాపు కోటి మందికి పైగా భక్తులు హాజరయ్యారని అంచనా. అమ్మవార్లను దర్శించుకుని.. ఎవరి స్తోమత మేరకు వారు మొక్కులు చెల్లించుకున్నారు. ఇందులో బంగారు ఆభరణాలు, స్వదేశీ, విదేశీ నోట్లు కానుకలుగా సమర్పించారు. అలా మొత్తంగా రూ.11,45,34,526 ఆదాయం సమకూరినట్లు అధికారులు తెలిపారు.

జాతర నేపథ్యంలో సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు గద్దెల వద్ద దేవాదాయ శాఖ హుండీలు ఏర్పాటు చేసింది. జాతర ముగిసిన తర్వాత వాటిని హనుమకొండలోని టీటీడీ కల్యాణ మండపానికి చేర్చారు. వీటి లెక్కింపు గత నెల 23న ప్రారంభించగా, ఈనెల 7న ముగిసింది. స్వదేశీ నగదు రూ.11,45,34,526, మిశ్రమ బంగారం 631 గ్రాములు, 48.350 కిలోల వెండి వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. అయితే వివిధ దేశాల నుంచి కరెన్సీల విలువ కట్టాల్సి ఉందని తెలిపారు.

2020లో రూ. 11.64 కోట్ల ఆదాయం రాగా, ఈసారి మాత్రం 11.45 కోట్లు మాత్రమే వచ్చిందని చెప్పారు. గత జాతరలో 1.639 కిలోల మిశ్రమ బంగారం రాగా, ఈసారి 631 గ్రాములు వచ్చింది. అదేవిధంగా 2020లో 53.454 కిలోల వెండి రాగా, ఈసారి 48.350 కిలోలు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. సమ్మక్క సారక్క జాతర చరిత్రలోనే తొలిసారిగా ఈ-హుండీ ఏర్పాటు చేశారు. క్యూఆర్‌ కోడ్‌ ఆధారంగా పనిచేసే ఈ హుండీకి మంచి స్పందన వచ్చింది. దీని ద్వారా రూ. 3 లక్షలు సమకూరినట్లు అధికారులు వెల్లడించారు.

More News

స్పెయిన్‌లో స్టెప్పులేస్తోన్న రామారావు

మాస్ మహారాజ్ రవితేజ వరుస సినిమాలతో జోరుమీదున్నారు. ఇప్పటికే ఖిలాడీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన ఆయన..

శృతి హాసన్‌కి మరో బంపరాఫర్.. చిరు పక్కన ఛాన్స్, స్వయంగా అనౌన్స్ చేసిన మెగాస్టార్

విలక్షణ నటుడు కమల్ హాసన్ నట వారసురాలిగా ఎంట్రీ ఇచ్చిన శృతి హాసన్ తన అందం, నటనతో దూసుకెళ్తున్నారు. మధ్యలో కొంచెం స్లో అయినా ఇటీవలి కాలంలో

హైదరాబాద్‌‌లోని మహిళా పోలీసులకు ‘భీమ్లా నాయక్’ స్పెషల్ షో.. ఎందుకంటే..?

హైదరాబాద్ పోలీస్ కమీషనర్‌గా బాధ్యతలు స్వీకరించని సీవీ ఆనంద్ తనదైన మార్క్ చూపిస్తున్నారు. వచ్చీ రాగానే  డ్రగ్స్ మాఫియా

రాధేశ్యామ్ ఎన్ఎఫ్‌టి లాంచ్ నేడే: ఆ 100 మందికి ప్రభాస్‌ను కలిసే ఛాన్స్, త్వరపడండి

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్- పూజా హెగ్డే నటించిన ‘‘రాధేశ్యామ్’’ ఎట్టకేలకు రిలీజ్‌కు రెడీ అవుతోంది.

జగన్ కీలక నిర్ణయం.. సంగం బ్యారేజీకి గౌతమ్ రెడ్డి పేరు, అసెంబ్లీలో ప్రకటన

ఇటీవల గుండెపోటుతో మరణించిన గౌతమ్‌రెడ్డి మరణంపై ఏసీ సీఎం వైఎస్ జగన్ మరోసారి ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లో