నాగ్ మెడల్స్.. గంగవ్వకు మహానటి.. అవినాష్‌కు కంత్రి
Send us your feedback to audioarticles@vaarta.com
గాన గంధర్వుడు బాల సుబ్రహ్మణ్యానికి గ్రేట్ ట్రిబ్యూట్ అర్పించిన అనంతరం షో స్టార్ట్ అయింది. శుక్రవారం జరిగింది చూసిన అనంతరం నాగ్.. కంటెస్టెంట్ల ముందుకు వెళ్లారు. ‘ట్రూత్ టవర్’ అనే గేమ్‌ను నాగ్ ఆడించారు. రోబోలు-మనుషులు గేమ్ బ్రహ్మాండంగా ఆడారని వెల్లడించారు. అయితే ‘ట్రూత్ టవర్’ గేమ్‌ను ఫస్ట్ హారిక ఆడింది. నీకు హౌస్‌లో ఏమాత్రం పోటీ అనిపించని కంటెస్టెంట్ ఎవరంటే.. కుమార్ సాయి అసలు పోటీ కానే కాదని చెప్పింది. నెక్ట్స్ వచ్చిన మోనాల్.. హౌస్‌లో నారదుడు ఎవరంటే సొహైల్ అని చెప్పింది. నీ మనసులో ఆల్ఫాబెట్ ‘ఎ’ ఉందని చెప్పారు. అప్పుడు అఖిల్ ఫేస్ వెలిగిపోయింది. నెక్ట్స్ లాస్య.. హౌస్‌లో ఉత్తమ అబద్ధాల కోరు ఎవరు? అని అడగ్గా.. మోనాల్ అని లాస్య చెప్పింది.
నెక్ట్స్ దేవి వచ్చింది. ఎలిమినేట్ అయిన వ్యక్తులతో ఎవరినైనా స్వాబ్ చేయాల్సి వస్తే ఎవరిని స్వాబ్ చేస్తావు? అంటే కుమార్ సాయి పేరు చెప్పింది. తరువాత వచ్చిన అరియానాను నీకు చిరాకు తెప్పించిన వ్యక్తి ఎవరు? అని నాగ్ అడగ్గా.. సొహైల్ అని చెప్పింది. అమ్మ రాజశేఖర్ కాదని.. అమాయకపు రాజశేఖర్ అంటూ నాగ్ ఇవాళ తెగ నవ్వించేశారు. నెక్ట్స్ వచ్చిన మెహబూబ్‌ను.. ఇంట్లో ఉండటానికి అర్హత లేని వారు ఎవరు? అని అడగ్గా.. కుమార్ సాయి అని చెప్పాడు. తరువాత వచ్చిన కుమార్ సాయిని.. ఈ ఇంట్లో అత్యంత ఫేక్ పర్సన్ ఎవరు? అని అడగ్గా.. అభిజిత్ అని చెప్పాడు. తనను ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడని పర్సనల్ అటాక్ చేస్తున్నాడని కుమార్ సాయి తెలిపాడు. ఇక బాగా ఆడిన ముగ్గురు కంటెస్టెంట్లకు నాగ్ మెడల్స్ అందించారు. అభికి మహానాయకుడు మెడల్ వేయగా.. అవినాష్‌కి కంత్రీ మెడల్.. ఇక మహానటి మెడల్‌ను గంగవ్వకు ఇచ్చారు. ఈ సందర్భంగా గంగవ్వకు మహానటి మెడల్ ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందో వీడియో చూపించి మరీ చెప్పారు. రోబోల టీంలో ఉన్న గంగవ్వ.. మనుషుల్ని ఎలా పిచ్చోళ్లని చేసిందో ఆ వీడియోలో చూపించారు. అది చూసిన గంగవ్వ.. ఇవన్నీ అంతా చూస్తారా? అంటూ అవాక్కైంది.
నెక్ట్స్ నామినేషన్స్‌లో ఉన్న వారిలో లాస్యను నాగ్ సేఫ్ చేశారు. అఖిల్‌ని మోనాల్ అభి అని పిలిచిందట. అందుకే తనపై కోపమొచ్చిందని నాగ్‌కి అఖిల్ చెప్పాడు. అమ్మ రాజశేఖర్ ఈ మధ్య బాగా కుళ్లు జోకులేస్తున్నాడని నోయెల్ చెప్పాడు. ఇక గంగవ్వ చాలా పక్షపాతంగా ఉంటుందని దేవి.. ఇంట్లో ఏమైపోతుందోనని లాస్య తెగ కంగారు పడిపోతుందని అవినాష్.. అందరితో అభి కలవడని సుజాత.. హారిక బ్రష్ చేసుకోకుండా టీ తాగుతుందని గంగవ్వ.. దేనికి ఏడవాలో.. దేనికి నవ్వాలో దివికి తెలియదని అమ్మ రాజశేఖర్ తెలిపారు. స్వాతి ఎవరెవరితో మాట్లాడాలి? ఎవరెవరితో క్లోజ్‌గా ఉండాలని ముందే ఫిక్స్ అయిందని లాస్య తెలిపింది. నెక్ట్స్ మోనాల్‌ను నాగ్ సేఫ్ జోన్‌లోకి పంపించారు. ఇంకా డేంజర్ జోన్‌లోనే హారిక, కుమార్ సాయి, దేవి, అరియానా, మెహబూబ్ ఉన్నారు. మొత్తానికి ఇవాళ షోని నాగ్ చాలా ఫన్నీగా నడిపించేశారు. మొన్న టాస్క్‌లో భాగంగా మనుషుల టీంలోని కొందరు కంటెస్టెంట్ల తీరుని ఏకి పారేస్తారనుకుంటే దానిని కూడా చాలా పాజిటివ్‌గానే తీసుకున్నారు. చిన్న చిన్న విషయాలను కూడా మైండ్‌లో పెట్టుకుని వాటిని చాలా ఫన్నీగా ప్రస్తావిస్తూ నాగ్ షోని హ్యూమరస్‌గా నడిపించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com