శరవేగంగా ముస్తాబవుతున్న 'మేడ మీద అబ్బాయి'

  • IndiaGlitz, [Thursday,May 18 2017]

కామెడీ చిత్రాల కథానాయకుడు అల్లరి నరేష్ నటిస్తున్న తాజా చిత్రం మేడమీద అబ్బాయి జాహ్నవి ఫిల్మ్స్ పతాకంపై బొప్పన చంద్రశేఖర్ నిర్మిస్తున్నారు. నిఖిల విమల్ కథానాయిక. మలయాళంలో ఘనవిజయం సాధించిన ఒరు వడక్కం సెల్ఫీ చిత్రానికి రీమేక్ ఇది. మాతృకకు దర్శకుడైన జి.ప్రజిత్ తెలుగు రీమేక్‌కు దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. ఈ సందర్భంగా నిర్మాత చిత్ర విశేషాలను తెలియజేస్తూ పొలాచ్చిలో జరిగిన భారీ షెడ్యూల్ తర్వాత హైదరాబాద్‌లో జరుగుతున్న మరో షెడ్యూల్ ఇది.
ఇప్పటి వరకు జరిగిన చిత్రీకరణతో 90శాతం షూటింగ్ పూర్తయింది. బ్యాలెన్స్ పాటను త్వరలోనే పూరిచేసి జూన్ చివరివారంలో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. గమ్యం శంభో శివ శంభో తర్వాత అలాంటి శక్తివంతమైన కథతో నరేష్ చేస్తున్న చిత్రమిది. రొమాంటిక్ కామెడీ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో స్క్రీన్‌ప్లే హైలైట్‌గా వుంటుంది. థ్రిల్లింగ్ అంశాలు వుంటూనే నరేష్ శైలి వినోదం వుంటుంది. నరేష్‌ను కొత్త కథలో చూడాలనుకునే వారికి ఈ సినిమాతో ఆ లోటు తీరిపోతుంది అని తెలిపారు.
అవసరాల శ్రీనివాస్, జయప్రకాష్, తులసి, సుధ, సత్యం రాజేష్, మధునందన్, జబర్దస్త్ ఆది, పద్మ జయంతి, రవిప్రకాష్, వెన్నెల రామారావు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు: చంద్రశేఖర్ (పిల్ల జమీందార్ ఫేమ్), సినిమాటోగ్రఫీ: ఉన్ని ఎస్ కుమార్, సంగీతం: షాన్ రెహమాన్, ఆర్ట్: రాజీవ్ నాయర్, ఎడిటర్: నందమూరి హరి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: ఎం.ఎస్.కుమార్, సమర్పణ: శ్రీమతి నీలిమ, నిర్మాత: బొప్పన చంద్రశేఖర్, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: జి.ప్రజిత్.

More News

అంతకుమించి కనిపించనున్న రష్మీ..

ఎస్ జై ఫిలింస్ పతాకంపై నిర్మితమవుతున్న చిత్రం అంతకుమించి. రష్మీ, సతీష్ జై హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి నిర్మాత సతీష్. భాను ప్రకాష్ తేళ్ల, కన్నా సహ నిర్మాతలు. జానీ దర్శకత్వం వహిస్తున్నారు.

'ఇదో ప్రేమలోకం' ఆడియో విడుదల

డా.స్వర్ణలత,సురేష్బాబు సమర్పణలో శ్రీ శ్రీనివాస ఫిలింస్ బ్యానర్పై డా.అశోక్ చంద్ర,తేజరెడ్డి,కారుణ్య హీరో హీరోయిన్లుగా

మే 20న రాజ్ తరుణ్ 'అంధగాడు' ట్రైలర్

యువ కథానాయకుడు రాజ్తరుణ్ `అంధగాడు`గా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యారు. ఏ టీవీ సమర్పణలో ప్రముఖ నిర్మాణ సంస్థ ఎ.కె.ఎంటర్టైన్మెంట్స్ ఇండియా ప్రై.లి. బ్యానర్లో రాజ్తరుణ్ హీరోగా ఈడోరకం-ఆడోరకం, కిట్టు ఉన్నాడు జాగ్రత్త వంటి సూపర్హిట్ చిత్రాలు తర్వాత రూపొందుతోన్న హ్యాట్రిక్ మూవీ `అంధగాడు`.

మళ్ళీ రాజమండ్రి వెళుతున్న చరణ్

మెగాపవర్స్టార్ రామ్చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్పై సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఏప్రిల్ 1 నుండి రాజమండ్రి పరిసరాల్లో ఇంత వరకు ఎవరూ చిత్రీకరించని నేచురల్ లోకేషన్స్లో మొదటి షెడ్యూల్ను పూర్తి చేశారు.

మూడోసారి హిట్ ద్వయం..

ప్రస్తుతం సూపర్స్టార్ మహేష్ తో సినిమా చేస్తున్న ఎ.ఆర్.మురుగదాస్ తదుపరి సినిమా ఎవరితో