మోహన్‌లాల్‌ను ఫాలో అవుతున్న మెగాస్టార్..!
Send us your feedback to audioarticles@vaarta.com
మెగాస్టార్ చిరంజీవి .. మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్‌ను ఫాలో అవుతున్నారంటూ ఓ వార్తొకటి సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తుంది. ఇంతకీ మన మెగాస్టార్ ఏ విషయంలో మోహన్‌లాల్‌ను ఫాలో అవుతున్నారనేగా.. వివరాల్లోకెళ్తే, మోహన్‌లాల్ టైటిల్ పాత్రలో నటించిన చిత్రం ‘లూసిఫర్’ను చిరంజీవి రీమేక్ చేయాలని అనుకుంటున్నారు. ఈ సినిమా డైరెక్షన్ రేసులో సుజిత్, వినాయక్ వంటి వారి పేర్లు వినిపించాయి. ఇప్పుడు ఈ రీమేక్‌ను మోహన్‌రాజా డైరెక్ట్ చేస్తున్నారు. ‘లూసిఫర్’ మాతృకలో మోహన్‌లాల్ పాత్రకు హీరోయిన్ ఉండదు. కానీ తెలుగులో చిరంజీవి ఇమేజ్ దృష్ట్యా హీరోయిన్ పాత్రను క్రియేట్ చేశారని వార్తలు వినిపించాయి. కానీ.. లేటెస్ట్ సమాచారం ప్రకారం చిరంజీవి ‘లూసిఫర్’లోనూ హీరోయిన్ ఉండదట. నెటివిటీకి తగ్గట్లు మార్పులు చేర్పులు కొన్ని మార్పులు చేశారట. కానీ హీరోయిన్ పాత్ర మాత్రం క్రియేట్ చేయలేదని టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం చిరంజీవి ‘ఆచార్య’ సినిమా షూటింగ్‌ను పూర్తి చేసిన తర్వాత ఈ రీమేక్‌ను స్టార్ట్ చేస్తారట. ఎన్.వి.ప్రసాద్, రామ్‌చరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తారట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments