క‌మెడియ‌న్‌పై మీటూ ఆరోప‌ణ‌

  • IndiaGlitz, [Thursday,November 01 2018]

మీటూ ఉద్య‌మంలో భాగంగా ప‌లువురు న‌టీమణులు త‌మ‌కు ఎదురైన లైంగిక వేధింపులు గురించి తెలియచేస్తున్నారు. ఇప్పుడు క‌న్న‌డ చిత్ర‌సీమ‌కు చెందిన సంగీత భ‌ట్ ఆరోప‌ణ‌లు చేసింది. పేరు చెప్ప‌కుండా ఓ త‌మిళ సినిమాలో న‌టిస్తున్న‌ప్పుడు క‌మెడియ‌న్‌తో బైక్‌పై వెళ్లే సీన్ చిత్రీక‌ర‌ణ‌లో అత‌ను అస‌భ్యంగా మాట్లాడాడ‌ని పేర్కొంది.

2016లో విడుద‌లైన 'ఆరంభ‌మే అట్ట‌హాసం' అనే త‌మిళ చిత్రంలో ప‌నిచేసింది. త‌మిళంలో అంత‌గా ఆద‌ర‌ణ ద‌క్క‌లేదు. దీంతో సంగీత క‌న్న‌డ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి బిజీ బిజీగా ఉంటుంది. త‌మిళ చిత్రాల్లో న‌టించాలంటే భ‌య‌మేస్తుంద‌ని అన్న సంగీత భ‌ట్ ఆ కమెడియ‌న్ ఎవ‌ర‌నేది మాత్రం చెప్ప‌లేదు.