అర్జున్ హద్దులు దాటకుండా ఉండాల్సింది..అర్జున్‌పై లైంగిక ఆరోపణలు
Send us your feedback to audioarticles@vaarta.com
150 చిత్రాలకు పైగా నటించిన సీనియర్ హీరో, నిర్మాత, దర్శకుడు యాక్షన్ కింగ్ అర్జున్ లైంగిక ఆరోపణలను ఎదుర్కొన్నారు. అర్జున్ 150వ చిత్రం `నిబునన్`(తెలుగులో కురుక్షేత్రం)లో ఆయన భార్య పాత్రధారిగా నటించిన శృతి హరిహరన్ ఆయనపై ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. శృతి హరి హరన్ ట్విట్టర్లో తను ఎదుర్కొన్న ఇబ్బందికర పరిస్థితులను రాసి పోస్ట్ చేశారు. ``చిన్నప్పట్నుంచి నేను చాలా సార్లు లైంగిక సమస్యలను ఫేస్ చేశాను. చాలా మంది మహిళలకు ఈ అనుభవం ఎదురయ్యే ఉంటుంది. నటిగా చాలా నేర్చుకోవాలనే ఉత్సాహంతో ఇండస్ట్రీలోకి వచ్చాను. కానీ నేడు విరక్తితో రాస్తున్నాను.
ఈ పరిశ్రమలో నాలో నైపుణ్యాన్ని పెంచడమే కాకుండా స్ఫూర్తిని కూడా నింపింది. కానీ చాలా సందర్భాల్లో భయపడ్డాను.. బాధపడ్డానని చెప్పుకోవడానికి హృదయం బద్ధలవుతుంది. సినిమాల్లో అవకాశం రావాలంటే ఇలా చేయాలంటారు. అదృష్టవశాత్తు నేను వాటి నుండి తప్పించుకున్నాను. కానీ 2016లో జరిగిన ఓ ఘటన నన్ను చాలా బాధపడుతుంది. అర్జున్ సినిమాలు చూస్తూ పెరిగిన నాకు ఆయనతో నటించే అవకాశం రావడంతో సంతోషపడ్డాను. ఆయనతో నటించిన సినిమాలో భార్య పాత్ర వేశాను. ఒకరినొకరు కౌగిలించుకుని డైలాగ్ చెప్పే పాత్ర అది. ఆ సన్నివేశాన్ని రిహార్సల్ చేసే సమయంలో ఆయన నా వెన్ను తడిమారు. ఇలా ప్రయత్నిద్దామా? అని డైరెక్టర్‌తో అన్నారు. నేను షాకయ్యా!.. ఆయన ప్రవర్తన నాకు నచ్చలేదు.
ఆ సమయంలో ఏమనాలో తెలియక నాపై నాకే కోపం వచ్చింది. నేను పనిచేసిన నటుడెవ్వరూ నన్ను ఇప్పటి వరకు ఇబ్బంది పెట్టలేదు. నేను అసౌకర్యంగా ఫీల్ కావడాన్నిడైరెక్షన్ టీమ్ గమనించింది. రిహార్సల్‌కు రాను.. నేరుగా షూటింగ్‌లోనే పాల్గొంటాను అని చెప్పేశాను. సెట్లో 50 మంది ముందు జరిగిన ఘటన. నేను సెట్లో ఆయనపై అరవలేదు. సంతకం చేశాను కాబట్టి ప్రాజెక్ట్ నుండి తప్పుకోవాలని కూడా అనుకోలేదు. ఆయన దూరంగా ఉండి షూటింగ్ పూర్తి చేశాను. అర్జున్ హద్దులు దాటకుండా ఉండాల్సింది. తన పవర్‌తో ఇతరులను ఇబ్బంది పెట్టకూడదు. ఇకపై ఏ మగవాడు.. స్త్రీని ఇబ్బంది పెట్టకూడదనే ఉద్యమమే ఇది. శక్తివంతంగా మారి మాట్లాడాల్సిన సమయం`` అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments