'ఎంసీఏ' థియేట్రికల్ ట్రైలర్ విడుదల
- IndiaGlitz, [Wednesday,December 13 2017]
వేణు శ్రీరామ్ దర్శకత్వంలో శ్రీ వెంకటే్శ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్‌రాజు, శిరీష్, లక్ష్మణ నిర్మాతలుగా సినిమా నిర్మితమవుతుంది. ఈ సినిమా డిసెంబర్ 21న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కానుంది. ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌విడుదల కార్యక్రమం మంగళవారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా...
దిల్ రాజు మాట్లాడుతూ - ''ఎంసీఏ' రిలీజ్ డేట్ అనౌన్స్ చేసేశాం. డిసెంబర్ 21న సినిమా విడుదలవుతుంది. పరీక్షలు పూర్తై, రిజల్ట్ కోసం వెయిట్ కోసం వెయిట్ చేస్తున్నట్లు యూనిట్ అందరం వెయిట్ చేస్తున్నాం. ఫస్ట్‌లుక్ విడుదల చేసినప్పటి నుండి..అలాగే టీజర్‌కి, సాంగ్స్‌కి వచ్చిన రెస్పాన్స్ ఎంతో బావుంది. నాని ప్రతి సినిమాకు ఏదో ఒక ప్రయోగం చేస్తూ సక్సెస్‌లో ఉన్నాం. ఈ ఏడాది మా బ్యానర్‌లో వస్తోన్న 6వ సినిమా ఎంసీఏ. సాయిపల్లవి..ఫిదా తర్వాత చేస్తున్న సినిమా. భూమికగారు ఈ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్నారు. డైరెక్టర్ వేణు..మిడిల్ క్లాస్ కుర్రాడు. తను ఎంతో కష్టపడి చేసిన సినిమా ఇది. సినిమా ట్రైలర్ విడుదలైన 30 నిమిషాలకే సినిమా ట్రైలర్ లక్ష వ్యూస్‌ను రాబట్టుకుంది. కచ్చితంగా సినిమాతో ప్రేక్షకులకు శాటిస్పై చేస్తాం'' అన్నారు.
రాజీవ్ కనకాల మాట్లాడుతూ - ''యువరాజ్ సింగ్ ఒకే ఓవర్‌లో ఆరు సిక్స్‌లు కొట్టినట్లు. ఈ సినిమాతో దిల్‌రాజుగారు ఆరో సిక్సర్ కొట్టడం ఖాయం. ఈ సినిమా కచ్చితంగా పెద్ద హిట్ అవుతుందని, అందరం కాన్ఫిడెంట్‌గా ఉన్నాం. నాని రియలిస్టిక్ పెర్ఫార్మర్. తనతో సినిమా చేయడం ఇదే తొలిసారి. చాలా సరదాగా గడిచిపోయింది. వేణుశ్రీరాం చాలా మంచి క్యారెక్టర్ ఇచ్చి ఎంకరేజ్ చేశారు. అందరికీ థాంక్స్'' అన్నారు.
దర్శకుడు వేణు శ్రీరామ్ మాట్లాడుతూ - ''ఐదు సంవత్సరాలు ఇంట్లో కూర్చున్న నన్ను నమ్మి..నాకు అవకాశం ఇచ్చిన నానికి థాంక్స్. రాజుగారికి, శిరీష్‌గారికి, లక్ష్మణ్‌గారికి, దేవిశ్రీప్రసాద్‌గారు సహా అందరికీ థాంక్స్. టీజర్‌లో చెప్పినట్లు మిడిల్ క్లాస్ అనేది ఓ మైండ్ సెట్. అది అందరిలో ఉండే మైండ్ సెట్. కాబట్టి సినిమా అందరికీ రీచ్ అవుతుందని నమ్ముతున్నాను'' అన్నారు.
నాని మాట్లాడుతూ - ''క్రిస్మస్ సీజన్‌ను సినిమా..మా సినిమా కావడం ఆనందంగా ఉంది. ఈ సీజన్‌లో వచ్చే సినిమాలన్నీ ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తాయి. అన్ని సక్సెస్ చేయాలి'' అన్నారు.