షూటింగ్ పూర్తి చేసుకున్న'ఏంసీఏ'..డిసెంబర్ 21న విడుదల
Send us your feedback to audioarticles@vaarta.com
నేచురల్ స్టార్ నాని, హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు కాంబినేషన్‌లో రూపొందుతోన్నసినిమా 'ఎం.సి.ఎ'. దిల్‌రాజు 'ఫిదా' చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు భానుమతిగా పరిచయమైన సాయిపల్లవి ఎం.సి.ఎలో హీరోయిన్‌గా నటించింది. శ్రీరామ్ వేణు దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌ఫై ఈ సినిమా రూపొందుతోంది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా డిసెంబర్ 21న విడుదలవుతుంది. ఈ సందర్భంగా ..
నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ - "ఆగస్ట్19నే మా ఎంసీఏ సినిమాను డిసెంబర్ 21న విడుదల చేస్తున్నామని ప్రకటించాను. తర్వాత డిసెంబర్ 15న విడుదల చేయడానికి ప్రయత్నాలు చేసినప్పటికీ కుదరలేదు. అందువల్ల సినిమాను డిసెంబర్ 21న విడుదల చేయబోతున్నాం. ఈ సినిమాను డిసెంబర్‌లో విడుదల చేయాలనుకోవడానికి కారణం..ఇప్పటికే మా బ్యానర్‌లో ఐదు సినిమాలు హిట్స్ వచ్చాయి.
అన్ని కుదిరితే ఈ సినిమాతో డబుల్ హ్యాట్రిక్ సాధించాలని అనుకున్నాం. అందుకనే స్క్రిప్ట్ అనుకున్నప్పటి నుండి డిసెంబర్ విడుదల ప్లాన్ చేశాం. అందులో భాగంగా డిసెంబర్ 21న సినిమా హిట్ అయితే మా బ్యానర్ డబుల్ హ్యాట్రిక్ సాధిస్తుంది. మధ్య తరగతి కుర్రాడికి కుటుంబ సభ్యులతో మంచి రిలేషన్ ఉంటుంది. సాధారణంగా ఆ రిలేషన్స్‌పై చాలా సినిమాలు వచ్చాయి. కానీ వదిన, మరిది మధ్య అనుబంధంపై సినిమాలు వచ్చి చాలాకాలమైంది.
ఈ సినిమా భూమిక వదినగా కనపడుతుంది. ఇందులో మధ్య తరగతి కుటుంబ సభ్యుల మధ్య రిలేషన్, డ్రామా అంతా కనపడుతుంది. వీటితో పాటు బ్యూటిఫుల్ లవ్‌స్టోరి ఉంటుంది. సాయిపల్లవి ఇందులో హీరోయిన్‌గా నటిస్తుంది. ఫిదా చిత్రంతో మా బ్యానర్‌లో నటించిన సాయిపల్లవి, ఈ సినిమాలో నటిచడం పెద్ద ప్లస్ పాయింట్.
నాని, సాయిపల్లవిల మధ్య ఉండే సీన్స్ చూసి ఆడియెన్స్ ఎగ్జయిట్ అవుతారు. సినిమాలో విజయ్ వర్మ విలన్‌గా కనిపిస్తాడు. అన్ని కోణాలు ఈ సినిమాలో చూడొచ్చు. అల్రెడి విడుదలైన సాంగ్స్‌ను ఆడియెన్స్ ఓన్ చేసుకున్నారు. దేవిశ్రీప్రసాద్ చాలా మంచి సంగీతాన్ని అందించారు. ఈ సోమవారం రోజున ట్రైలర్ కూడా విడుదల చేయబోతున్నాం.
సమీర్‌రెడ్డి అద్భుతమైన విజువల్స్ ఇచ్చారు. డైరెక్టర్ వేణు మిడిల్ క్లాస్ కుర్రాడు కాబట్టి, ప్రేక్షకులకు రీచ్ అయ్యేలా సీన్స్‌ను రాసుకున్నాడు.అన్ని మ్యాజిక్ వర్కవుట్ అయితే సినిమా పెద్ద హిట్ సాధిస్తుంది. డిసెంబర్ 16న ప్రీ రిలీజ్ వేడుకను ప్లాన్ చేస్తున్నాం. డిసెంబర్ 21న ప్రేక్షకులు ఏం చెబుతారని ఆసక్తిగా వెయిట్ చేస్తున్నాం" అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments