షూటింగ్ పూర్తి చేసుకున్న'ఏంసీఏ'..డిసెంబ‌ర్ 21న విడుద‌ల‌

  • IndiaGlitz, [Thursday,December 07 2017]

నేచుర‌ల్ స్టార్ నాని, హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు కాంబినేష‌న్‌లో రూపొందుతోన్నసినిమా 'ఎం.సి.ఎ'. దిల్‌రాజు 'ఫిదా' చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు భానుమ‌తిగా ప‌రిచ‌య‌మైన సాయిప‌ల్ల‌వి ఎం.సి.ఎలో హీరోయిన్‌గా న‌టించింది. శ్రీరామ్ వేణు ద‌ర్శ‌క‌త్వంలో శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌ఫై ఈ సినిమా రూపొందుతోంది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా డిసెంబ‌ర్ 21న విడుద‌ల‌వుతుంది. ఈ సంద‌ర్భంగా ..

నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ - "ఆగ‌స్ట్‌19నే మా ఎంసీఏ సినిమాను డిసెంబ‌ర్ 21న విడుద‌ల చేస్తున్నామ‌ని ప్ర‌క‌టించాను. త‌ర్వాత డిసెంబ‌ర్ 15న విడుద‌ల చేయ‌డానికి ప్ర‌య‌త్నాలు చేసిన‌ప్ప‌టికీ కుద‌ర‌లేదు. అందువ‌ల్ల సినిమాను డిసెంబ‌ర్ 21న విడుద‌ల చేయ‌బోతున్నాం. ఈ సినిమాను డిసెంబ‌ర్‌లో విడుద‌ల చేయాల‌నుకోవ‌డానికి కార‌ణం..ఇప్ప‌టికే మా బ్యాన‌ర్‌లో ఐదు సినిమాలు హిట్స్ వ‌చ్చాయి.

అన్ని కుదిరితే ఈ సినిమాతో డబుల్ హ్యాట్రిక్ సాధించాల‌ని అనుకున్నాం. అందుక‌నే స్క్రిప్ట్ అనుకున్న‌ప్ప‌టి నుండి డిసెంబ‌ర్ విడుద‌ల ప్లాన్ చేశాం. అందులో భాగంగా డిసెంబ‌ర్ 21న సినిమా హిట్ అయితే మా బ్యాన‌ర్ డ‌బుల్ హ్యాట్రిక్ సాధిస్తుంది. మ‌ధ్య త‌ర‌గ‌తి కుర్రాడికి కుటుంబ స‌భ్యుల‌తో మంచి రిలేష‌న్ ఉంటుంది. సాధార‌ణంగా ఆ రిలేష‌న్స్‌పై చాలా సినిమాలు వ‌చ్చాయి. కానీ వ‌దిన‌, మ‌రిది మ‌ధ్య అనుబంధంపై సినిమాలు వ‌చ్చి చాలాకాల‌మైంది.

ఈ సినిమా భూమిక వ‌దిన‌గా క‌న‌ప‌డుతుంది. ఇందులో మ‌ధ్య త‌ర‌గ‌తి కుటుంబ స‌భ్యుల మ‌ధ్య రిలేష‌న్‌, డ్రామా అంతా క‌న‌ప‌డుతుంది. వీటితో పాటు బ్యూటిఫుల్ ల‌వ్‌స్టోరి ఉంటుంది. సాయిప‌ల్ల‌వి ఇందులో హీరోయిన్‌గా న‌టిస్తుంది. ఫిదా చిత్రంతో మా బ్యాన‌ర్‌లో నటించిన సాయిప‌ల్ల‌వి, ఈ సినిమాలో న‌టిచ‌డం పెద్ద ప్ల‌స్ పాయింట్‌.

నాని, సాయిప‌ల్ల‌విల మ‌ధ్య ఉండే సీన్స్ చూసి ఆడియెన్స్ ఎగ్జ‌యిట్ అవుతారు. సినిమాలో విజ‌య్ వ‌ర్మ విల‌న్‌గా క‌నిపిస్తాడు. అన్ని కోణాలు ఈ సినిమాలో చూడొచ్చు. అల్రెడి విడుద‌లైన సాంగ్స్‌ను ఆడియెన్స్ ఓన్ చేసుకున్నారు. దేవిశ్రీప్ర‌సాద్ చాలా మంచి సంగీతాన్ని అందించారు. ఈ సోమ‌వారం రోజున ట్రైల‌ర్ కూడా విడుద‌ల చేయ‌బోతున్నాం.

స‌మీర్‌రెడ్డి అద్భుత‌మైన విజువ‌ల్స్ ఇచ్చారు. డైరెక్ట‌ర్ వేణు మిడిల్ క్లాస్ కుర్రాడు కాబ‌ట్టి, ప్రేక్ష‌కులకు రీచ్ అయ్యేలా సీన్స్‌ను రాసుకున్నాడు.అన్ని మ్యాజిక్ వ‌ర్కవుట్ అయితే సినిమా పెద్ద హిట్ సాధిస్తుంది. డిసెంబ‌ర్ 16న ప్రీ రిలీజ్ వేడుక‌ను ప్లాన్ చేస్తున్నాం. డిసెంబ‌ర్ 21న ప్రేక్ష‌కులు ఏం చెబుతార‌ని ఆసక్తిగా వెయిట్ చేస్తున్నాం" అన్నారు.

More News

'అజ్ఞాత‌వాసి` సెకండ్ సింగిల్ డేట్‌, ఆడియో డేట్‌

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో మూడో చిత్రంగా 'అజ్ఞాతవాసి' సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జ‌రుపుకుంటోంది.

శర్వానంద్ సినిమా తప్పుకున్న నిత్యా?

‘అలా మొదలైంది’ సినిమాతో తెలుగు పరిశ్రమలో అడుగుపెట్టిన టాలెంటెడ్ హీరోయిన్ నిత్యా మీనన్. ‘ఇష్క్’, ‘గుండెజారి గల్లంతయ్యిందే’, ‘మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు’ సినిమాలతో నటిగా తానేంటో నిరూపించుకుంది ఈ కేరళకుట్టి.

స‌మంత‌.. డ‌బుల్ ధ‌మాకా

యువ క‌థానాయకుడు నాగ‌చైత‌న్య‌ని ఇటీవ‌లే పెళ్లి చేసుకున్న స‌మంత‌.. మ‌ళ్లీ సినిమాల‌తో బిజీగా మారింది. తెలుగు, త‌మిళ భాష‌ల్లో సినిమాలు చేస్తోంది.

హ‌లో.. ర‌మ్య‌కృష్ణ‌కి ఎంతో స్పెష‌ల్‌

ర‌మ్య‌కృష్ణ‌.. ఒక‌ప్పుడు గ్లామ‌ర్ హీరోయిన్‌. ఇప్పుడు క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌. అయితే అప్పుడు.. ఇప్పుడు.. ఒక పాయింట్ మాత్రం కామ‌న్‌. అదేమిటంటే.. ఎలాంటి పాత్ర‌లోనైనా ఇట్టే ఒదిగిపోవ‌డం.

అను.. మెగా నామ సంవ‌త్స‌రం?

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్‌, మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌.. ఇలా ఈ ముగ్గురు మెగా హీరోస్ తో జోడీక‌ట్టిన క‌థానాయిక‌లుగా త‌మ‌న్నా, శ్రుతి హాస‌న్‌, కాజ‌ల్‌, స‌మంత‌కి ప్ర‌త్యేక స్థానం ఉంది.