భారీ ప్రీ రిలీజ్ ని ప్లాన్ చేసిన 'ఎంసిఏ' నిర్మాతలు

  • IndiaGlitz, [Monday,December 11 2017]

నేచుర‌ల్ స్టార్ నాని, సాయిప‌ల్ల‌వి జంట‌గా న‌టిస్తున్న చిత్రం 'ఎంసీఏ'. శ్రీరామ్ వేణు ద‌ర్శ‌క‌త్వంలో శ్రీ వెంక‌టే్శ్వ‌ర క్రియేషన్స్ బ్యాన‌ర్‌పై దిల్‌రాజు, శిరీష్, ల‌క్ష్మ‌ణ నిర్మాత‌లుగా సినిమా నిర్మిత‌మ‌వుతుంది. ఈ సినిమా డిసెంబ‌ర్ 21న ప్ర‌పంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను డిసెంబ‌ర్ 16న వ‌రంగ‌ల్‌లో నిర్వ‌హిస్తున్నారు.

ఈ సంద‌ర్భంగా... హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ - ''డ‌బుల్ హ్యాట్రిక్ హీరో నాని ఈ ఏడాది ప్రారంబంలో మా శ్రీ వెంకటేశ్వర క్రియేష‌న్స్‌ బ్యాన‌ర్‌లో 'నేను లోక‌ల్‌' సినిమాతో హిట్ కొట్టాడు. ఇప్పుడు ఈ ఏడాది చివ‌ర‌ల్లో 'ఎంసీఏ' సినిమాతో మ‌రో హిట్‌ను సాధించ‌బోతున్నాడు. ఈ సినిమా స‌క్సెస్‌తో మా బ్యాన‌ర్ ఒకే ఏడాది డబుల్ హ్యాట్రిక్ సాధిస్తుంద‌ని కాన్ఫిడెంట్‌గా ఉన్నాం. రేపు (డిసెంబర్ 12న) ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ ని విడుదల చేయనున్నాం. ఈ సినిమా కి సంబంధించిన పోస్ట్ ప్రొడక్ష‌న్ ప‌నులు తుది ద‌శ‌కు చేరుకున్నాయి. వ‌దిన‌, మ‌రిదిల మ‌ధ్య అనుబంధాన్ని తెలియ‌జేసే చిత్రంగా మా ఎంసీఏ ప్రేక్ష‌కుల ముందుకు డిసెంబ‌ర్ 21న విడుద‌ల కానుంది. సినిమా ప్రారంభం నుండి నాని, సాయిప‌ల్ల‌వి జంట ఈ సినిమాలో న‌టిస్తున్నార‌నగానే సినిమాపై మంచి అంచ‌నాలు ఏర్పడ్డాయి. సినిమా చాలా బాగా వచ్చింది. శ్రీరామ్ వేణు సినిమా ను చ‌క్క‌గా డైరెక్ట్ చేశాడు. దేవి శ్రీ ప్రసాద్ అద్భుత‌మైన సాంగ్స్‌ను అందించాడు. ఈ పాట‌లు అల్రెడి మార్కెట్లోకి విడుద‌ల‌య్య‌యాయి. సాంగ్స్‌కి సూప‌ర్బ్ రెస్పాన్స్ వ‌చ్చింది. అలాగే . ఈ డిసెంబ‌ర్ 16న వ‌రంగ‌ల్‌లో ప్రీ రిలీజ్ వేడుకను అభిమానుల స‌మ‌క్షంలో గ్రాండ్‌గా నిర్వ‌హించ‌బోతున్నాం'' అన్నారు.

More News

వెంకీ జోడీ కుదిరిందా?

గురు తరువాత సీనియర్ కథానాయకుడు విక్టరీ వెంకటేష్.. తన తదుపరి చిత్రానికి బాగానే గ్యాప్ తీసుకున్నారు.

'ఒక్క క్షణం' ఆ సినిమాకి కాపీ వెర్షనా?

అల్లు శిరీష్, సురభి, అవసరాల శ్రీనివాస్, సీరత్ కపూర్ ప్రధాన పాత్రల్లో రూపొందిన చిత్రం `ఒక్క క్షణం`. `ఎక్కడికి పోతావు చిన్నవాడా` చిత్రంతో ఆకట్టుకున్న వి.ఐ.ఆనంద్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. మణిశర్మ సంగీతమందించారు.

'హలో'.. అనూప్ మెప్పించాడు

జై చిత్రంతో సంగీత దర్శకుడిగా తొలి అడుగులు వేసిన అనూప్ రూబెన్స్.. హలో చిత్రంతో 50 చిత్రాల మైలురాయికి చేరుకున్నాడు.

అల్లు శిరీష్ కి కూడా కలిసొస్తాడా?

మెగా ఫ్యామిలీకి కలిసొచ్చిన సంగీత దర్శకుడు అంటే మొదటగా వినిపించే పేరు మెలోడీ బ్రహ్మ మణిశర్మ.

వస్తున్నాం..బ్లాక్ బస్టర్ హిట్ కొడుతున్నాం..ఇది ఫిక్స్ !! - కింగ్ నాగార్జున

అఖిల్ హీరోగా సినిమా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అక్కినేని అభిమానులను, సినీ ప్రేక్షకులను `హలో`అంటూ డిసెంబర్ 22న పలకరించబోతున్నారు యూత్ కింగ్ అఖిల్ అక్కినేని. ఈయన కథానాయకుడిగా అన్నపూర్ణ స్టూడియోస్, మనం ఎంటర్ప్రైజెస్ సమర్పణలో 'మనం' ఫేమ్ విక్రమ్ కె. కుమార్ దర్శకత్వంలో అక్కినేని నాగార్జున నిర్మిస్తున్న ఫ్యామిలీ, రొమాంటిక