'మయూరి'వచ్చేస్తోంది...
Send us your feedback to audioarticles@vaarta.com
చంద్రకళ` పిశాచి వంటి సూపర్‌హిట్ చిత్రాన్ని అందించిన సి.కళ్యాణ్ సి.కె.ఎంటర్టైన్మెంట్స్ ప్రై. లిమిటెడ్,బ్యానర్‌పై సి.కళ్యాణ్ మయూరి` చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. నయనతార టైటిల్ రోల్ పోపిస్తున్న ఈ చిత్రం హర్రర్, థ్రిల్లర్ కాన్సెప్ట్ తో రూపొందుతోంది. ఇప్పటి వరకు గ్లామర్, పెర్ ఫార్మెన్స్ పాత్రలకే పరిమితమైన నయనతార త్వరలోనే భయపెట్టడానికి సిద్ధమవుతుంది.
తమిళంలోమాయ` అనే పేరుతో తెరకెక్కుతోన్న ఈ హర్రర్ థ్రిల్లర్ ఆశ్వనీ శరవణన్ దర్శకుడు. ఈ చిత్రంలో నయనతార ఓ బిడ్డకు తల్లిగా కనపడుతుంది. తమిళంలో ఇప్పటికే విడుదలైన ట్రైలర్ మంచి స్పందన వచ్చింది. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందిస్తున్నారు. ప్రస్తుతం సినిమాని సెప్టెంబర్ 17న వినాయకచవితి కానుకగా విడుదల చేయడానికి కళ్యాణ్ సన్నాహాలు చేస్తున్నారట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments