'మయూరాక్షి' ఆడియో లాంచ్
Send us your feedback to audioarticles@vaarta.com
`భాగమతి` ఫేం ఉన్ని ముకుందన్ హీరోగా మియా జార్జ్ హీరోయిన్ గా మలయాళంలో రూపొందిన `ఐరా` అనే సూపర్ హిట్ చిత్రాన్ని `మయూరాక్షి` పేరుతో శ్రీ శ్రీ శ్రీ శూలిని దుర్గా ప్రొడక్షన్స్ పతాకంపై తెలుగులోకి అనువదిస్తున్నారు యువ నిర్మాత వరం జయంత్ కుమార్. సూపర్ హిట్ చిత్రాల సంగీత దర్శకుడు గోపీసుందర్ సంగీతాన్ని సమకూర్చిన ఈ చిత్రలోని పాటలు ఈ రోజు ప్రసాద్ ల్యాబ్స్ లో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసి ప్రముఖ దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి, ప్రముఖ నిర్మాతలు కె.అచ్చిరెడ్డి, శివలెంక కృష్ణ ప్రసాద్ బిగ్ సీడీని ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఎస్వీ కృష్ణా రెడ్డి మాట్లాడుతూ...`` అనువాద చిత్రానికి తెలుగుదనంతో కూడిన మయూరాక్షి` అనే టైటిల్ పెట్టడంలోనే నిర్మాత యొక్క అభిరుచి ఏంటో తెలుస్తుంది. ఇక గోపీ సుందర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన తెలుగులో చేసిన ఎన్నో చిత్రాలు సక్సెస్ సాధించాయి. ఈ సినిమా పాటలు కూడా విన్నాం, చూశాం.. ఎంతో మెలోడియస్ గా ఉన్నాయి. ట్రైలర్ చూడగానే సినిమా చూడాలన్ని క్యూరియాసిటీ కలిగింది. ఉన్ని ముకుందన్ తెలుగు ప్రేక్షకులకు ఎంతో సుపరిచితమైన హీరో. మిస్టరీతో కూడిన ఈ థ్రిల్లర్ చిత్రాలకు ఎప్పుడూ ఆదరణ ఉంటూనే ఉంటుంది..ఈ సినిమా కూడా విజయం సాధించి యువ నిర్మాత వరం జయంత్ కుమార్ కు మంచి పేరు తేవాలని`` అన్నారు.
ప్రముఖ నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ...``పాటలు, ట్రైలర్ ఇంప్రెసివ్ గా ఉన్నాయి. థ్రిల్లర్ చిత్రాలను తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తూనే ఉంటారు. ఆ కోవలో ఈ చిత్రం కూడా పెద్ద సక్సెస్ సాధించి నిర్మాతకు మంచి పేరు రావాలని కోరుకుంటున్నా`` అన్నారు.
ప్రముఖ నిర్మాత కె.అచ్చిరెడ్డి మాట్లాడుతూ...`గోపీసుందర్ మ్యూజిక్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. తెలుగులో ఆయన ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ ఇచ్చారు. ఇందులో కూడా రెండు అద్భుతమైన సాంగ్స్ ఉన్నాయి. ట్రైలర్ ,టైటిల్ రెండూ ఇంట్రస్టింగ్ గా ఉన్నాయి. మార్చి 19న విడుదలకు సిద్ధమవుతోన్న ఈ చిత్రం ఘన విజయం సాధించాని కోరుకుంటూ యంగ్ ప్రొడ్యూసర్ జయంత్ కుమార్ కి ఆల్ ది బెస్ట్ చెబుతున్నా`` అన్నారు.
సింగర్ శ్రీకృష్ణ మాట్లాడుతూ...``ఇందులో ఒక మంచి మెలోడీ సాంగ్ నయన నయ్యర్ తో కలిసి పాడాను. ఒక మంచి సినిమాలో పార్ట్ కావ డం హ్యాపీ. సినిమా మంచి సక్సెస్ సాధించాలని`` అన్నారు.
సింగర్ నయన నయ్యర్ మాట్లాడుతూ...``శ్రీకృష్ణ గారితో కలిసి ఇందులో నేను మెలోడీ సాంగ్ పాడాను. తెలుగులో పాడే అవకాశం కల్పించిన నిర్మాతకు నా ధన్యవాదాలు`` అన్నారు
పాటల రచయిత పూర్ణాచారి మాట్లాడుతూ...``గతంలో నేను ఈ బేనర్ లో రెండు సినిమాలకు పాటలన్నీ రాశాను. ఈ సినిమాకు కూడా పాటలన్నీ రాశాను. గోపీసుందర్ గారు మంచి ట్యూన్స్ ఇచ్చారు``అన్నారు.
సింగర్ రఘురామ్ మాట్లాడుతూ...`` గతంలో గోపీసుంరద్ గారి మ్యూజిక్ డైరక్షన్ లో పాడాను. మళ్లీ ఆయన మ్యూజిక్ లో ఒక మంచి మెలోడీ సాంగ్ పాడటం చాలా సంతోషం `` అన్నారు.
నిర్మాత వరం జయంత్ కుమార్ మట్లాడుతూ...`` సస్పెన్స్ రొమాంటిక్ క్రైమ్ థ్రిల్రర్ గా ఈ చిత్రం రూపొందింది. ఉన్ని ముకుందన్, మియా జార్జ్ నటన, గోపీసుందర్ మ్యూజిక్ సినిమాకు హైలెట్స్. మార్చి 19న థియేటర్స్ లోకి రాబోతున్న మా చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశిస్తున్నా`` అన్నారు.
ఇంకా ఈ కార్యక్రమంలో మ్యూజిక్ కో-ఆర్డినేటర్స్ మోత్కూరి చిరంజీవి, మాల్య కందుకూరి పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంగీతంః గోపీ సందర్; పాటలుః పూర్ణాచారి; కో-ప్రొడ్యూసర్ః వరం యశ్వంత్ సాయి కుమార్; నిర్మాతః వరం జయంత్ కుమార్; దర్శకుడుః సాయి జు ఎస్.ఎస్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com