'మ‌యూరాక్షి' ఆడియో లాంచ్‌

  • IndiaGlitz, [Monday,February 15 2021]

'భాగ‌మ‌తి' ఫేం ఉన్ని ముకుంద‌న్ హీరోగా మియా జార్జ్ హీరోయిన్ గా మ‌ల‌యాళంలో రూపొందిన 'ఐరా' అనే సూప‌ర్ హిట్ చిత్రాన్ని 'మ‌యూరాక్షి' పేరుతో శ్రీ శ్రీ శ్రీ శూలిని దుర్గా ప్రొడక్ష‌న్స్ ప‌తాకంపై తెలుగులోకి అనువ‌దిస్తున్నారు యువ నిర్మాత వ‌రం జ‌యంత్ కుమార్. సూప‌ర్ హిట్ చిత్రాల సంగీత ద‌ర్శ‌కుడు గోపీసుంద‌ర్ సంగీతాన్ని స‌మ‌కూర్చిన ఈ చిత్రలోని పాట‌లు ఈ రోజు ప్ర‌సాద్ ల్యాబ్స్ లో ఆవిష్క‌రించారు. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథులుగా విచ్చేసి ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు ఎస్వీ కృష్ణారెడ్డి, ప్ర‌ముఖ నిర్మాతలు కె.అచ్చిరెడ్డి, శివ‌లెంక కృష్ణ ప్ర‌సాద్ బిగ్ సీడీని ఆవిష్క‌రించారు.

ఈ సంద‌ర్భంగా ఎస్వీ కృష్ణా రెడ్డి మాట్లాడుతూ...'' అనువాద చిత్రానికి తెలుగుద‌నంతో కూడిన మ‌యూరాక్షి' అనే టైటిల్ పెట్ట‌డంలోనే నిర్మాత యొక్క అభిరుచి ఏంటో తెలుస్తుంది. ఇక గోపీ సుంద‌ర్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఆయ‌న తెలుగులో చేసిన ఎన్నో చిత్రాలు స‌క్సెస్ సాధించాయి. ఈ సినిమా పాట‌లు కూడా విన్నాం, చూశాం.. ఎంతో మెలోడియ‌స్ గా ఉన్నాయి. ట్రైల‌ర్ చూడ‌గానే సినిమా చూడాల‌న్ని క్యూరియాసిటీ క‌లిగింది. ఉన్ని ముకుంద‌న్ తెలుగు ప్రేక్ష‌కుల‌కు ఎంతో సుప‌రిచిత‌మైన హీరో. మిస్ట‌రీతో కూడిన ఈ థ్రిల్ల‌ర్ చిత్రాల‌కు ఎప్పుడూ ఆద‌ర‌ణ ఉంటూనే ఉంటుంది..ఈ సినిమా కూడా విజ‌యం సాధించి యువ నిర్మాత వ‌రం జ‌యంత్ కుమార్ కు మంచి పేరు తేవాల‌ని'' అన్నారు.

ప్ర‌ముఖ నిర్మాత శివ‌లెంక కృష్ణ ప్ర‌సాద్ మాట్లాడుతూ...''పాట‌లు, ట్రైల‌ర్ ఇంప్రెసివ్ గా ఉన్నాయి. థ్రిల్ల‌ర్ చిత్రాలను తెలుగు ప్రేక్ష‌కులు ఎప్పుడూ ఆద‌రిస్తూనే ఉంటారు. ఆ కోవ‌లో ఈ చిత్రం కూడా పెద్ద స‌క్సెస్ సాధించి నిర్మాత‌కు మంచి పేరు రావాల‌ని కోరుకుంటున్నా'' అన్నారు.

ప్ర‌ముఖ నిర్మాత కె.అచ్చిరెడ్డి మాట్లాడుతూ...'గోపీసుంద‌ర్ మ్యూజిక్ గురించి ప్ర‌త్యేకించి చెప్పాల్సిన ప‌నిలేదు. తెలుగులో ఆయ‌న ఎన్నో సూప‌ర్ హిట్ సాంగ్స్ ఇచ్చారు. ఇందులో కూడా రెండు అద్భుత‌మైన సాంగ్స్ ఉన్నాయి. ట్రైల‌ర్ ,టైటిల్ రెండూ ఇంట్ర‌స్టింగ్ గా ఉన్నాయి. మార్చి 19న విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోన్న ఈ చిత్రం ఘ‌న విజ‌యం సాధించాని కోరుకుంటూ యంగ్ ప్రొడ్యూస‌ర్ జ‌యంత్ కుమార్ కి ఆల్ ది బెస్ట్ చెబుతున్నా'' అన్నారు.

సింగ‌ర్ శ్రీకృష్ణ మాట్లాడుతూ...''ఇందులో ఒక మంచి మెలోడీ సాంగ్ న‌య‌న న‌య్య‌ర్ తో క‌లిసి పాడాను. ఒక మంచి సినిమాలో పార్ట్ కావ డం హ్యాపీ. సినిమా మంచి స‌క్సెస్ సాధించాలని'' అన్నారు.

సింగ‌ర్ న‌య‌న న‌య్య‌ర్ మాట్లాడుతూ...''శ్రీకృష్ణ గారితో క‌లిసి ఇందులో నేను మెలోడీ సాంగ్ పాడాను. తెలుగులో పాడే అవ‌కాశం క‌ల్పించిన నిర్మాత‌కు నా ధ‌న్య‌వాదాలు'' అన్నారు

పాట‌ల ర‌చ‌యిత పూర్ణాచారి మాట్లాడుతూ...''గ‌తంలో నేను ఈ బేన‌ర్ లో రెండు సినిమాల‌కు పాట‌ల‌న్నీ రాశాను. ఈ సినిమాకు కూడా పాట‌ల‌న్నీ రాశాను. గోపీసుంద‌ర్ గారు మంచి ట్యూన్స్ ఇచ్చారు''అన్నారు.

సింగ‌ర్ ర‌ఘురామ్ మాట్లాడుతూ...'' గ‌తంలో గోపీసుంర‌ద్ గారి మ్యూజిక్ డైర‌క్ష‌న్ లో పాడాను. మ‌ళ్లీ ఆయ‌న మ్యూజిక్ లో ఒక మంచి మెలోడీ సాంగ్ పాడటం చాలా సంతోషం '' అన్నారు.

నిర్మాత వ‌రం జ‌యంత్ కుమార్ మ‌ట్లాడుతూ...'' స‌స్పెన్స్ రొమాంటిక్ క్రైమ్ థ్రిల్రర్ గా ఈ చిత్రం రూపొందింది. ఉన్ని ముకుంద‌న్, మియా జార్జ్ న‌ట‌న‌, గోపీసుంద‌ర్ మ్యూజిక్ సినిమాకు హైలెట్స్. మార్చి 19న థియేట‌ర్స్ లోకి రాబోతున్న మా చిత్రాన్ని ప్రేక్ష‌కులు ఆద‌రిస్తార‌ని ఆశిస్తున్నా'' అన్నారు.

ఇంకా ఈ కార్య‌క్ర‌మంలో మ్యూజిక్ కో-ఆర్డినేట‌ర్స్ మోత్కూరి చిరంజీవి, మాల్య కందుకూరి పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంగీతంః గోపీ సంద‌ర్‌; పాటలుః పూర్ణాచారి; కో-ప్రొడ్యూస‌ర్ః వ‌రం య‌శ్వంత్ సాయి కుమార్; నిర్మాతః వ‌రం జ‌యంత్ కుమార్; ద‌ర్శ‌కుడుః సాయి జు ఎస్‌.ఎస్‌.