Mayabazaar For Sale:100 మిలియన్ల స్ట్రీమింగ్ మినిట్స్ దాటి దూసుకుపోతున్న... 'మాయాబ‌జార్ ఫ‌ర్ సేల్‌' వెబ్‌సీరీస్

  • IndiaGlitz, [Friday,July 28 2023]

రానా ద‌గ్గుబాటి స్పిరిట్ మీడియా డెబ్యూ వెబ్ సిరీస్ ‘మాయాబజార్ ఫర్ సేల్’కు అమేజింగ్ రెస్పాన్స్‌... 100 మిలియన్ల‌ స్ట్రీమింగ్‌ మినిట్స్ దాటి దూసుకెళ్తోన్న ఒరిజిన‌ల్ సీరీస్‌

వైవిధ్య‌మైన కంటెంట్‌ను ప‌లు భాష‌ల్లో అందిస్తూ త‌నదైన మార్క్ క్రియేట్ చేసి దూసుకెళ్తోన్న డిజిటల్ మాధ్యమం జీ 5 అందించిన స‌రికొత్త మ‌ల్టీస్టార‌ర్ తెలుగు వెబ్ ఒరిజిన‌ల్ ‘మాయాబజార్ ఫర్ సేల్’. సీనియ‌ర్ న‌రేష్‌, న‌వ‌దీప్‌, ఈషా రెబ్బా, హ‌రి తేజ‌, ర‌వివ‌ర్మ‌, త‌రుణ్ భాస్క‌ర్ త‌దితరులు నటించారు. సెటైరికల్ డ్రామాగా ‘మాయాబజార్ ఫర్ సేల్’ వెబ్ సిరీస్ రూపొందింది. జీ 5తో పాటు రానా ద‌గ్గుబాటికి సంబంధించిన స్పిరిట్ మీడియా బ్యాన‌ర్ క‌లిసి సునిశిత‌మైన‌, హృద్య‌మైన డ్రామాగా మాయాబ‌జార్ ఫ‌ర్ సేల్‌ను రూపొందించారు. ఇదొక గేటెడ్ క‌మ్యూనిటీలోని కుటుంబాల చుట్టూ తిరుగుతుంది. గౌత‌మి చిల్ల‌గుల్ల ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

గేటెడ్ కమ్యూనిటీలోని కుటుంబాలకు సంబంధించిన ఆస‌క్తిక‌ర‌మైన అంశాల‌తో రూపొందిన ఈ వెబ్ ఒరిజిన‌ల్ జీ5లో ప్రేక్ష‌కుల ఆద‌ర‌ణ‌తో దూసుకెళ్తూ 100 మిలియ‌న్ స్ట్రీమింగ్‌ మినిట్స్‌ను క్రాస్ చేసింది. రానా ద‌గ్గుబాటి స్పిరిట్ మీడియా బ్యాన‌ర్ రూపొందించిన తొలి వెబ్ సిరీస్ ‘మాయాబజార్ ఫర్ సేల్’కు అమేజింగ్ రెస్పాన్స్ రావ‌టంపై ఎంటైర్ టీమ్ చాలా హ్యాపీగా ఉన్నారు.

ఆ సంద‌ర్భంగా...

జీ 5 చీఫ్ బిజినెస్ ఆఫీస‌ర్ మ‌నీష్ క‌ల్రా మాట్లాడుతూ ‘‘‘మాయాబజార్ ఫర్ సేల్’ సిరీస్‌కు అతి కొద్ది స‌మ‌యంలోనే చాలా మంచి రెస్పాన్స్ రావ‌టం సంతోషంగా ఉంది. న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల అద్భుత‌మైన వ‌ర్క్ కార‌ణంగా ఈ రిజ‌ల్ట్ వ‌చ్చింది. భ‌విష్య‌త్తులోనూ ఇంత మంచి కంటెంట్‌తో ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తాం’’ అన్నారు.

జీ 5 చీఫ్ కంటెంట్ ఆఫీస‌ర్ అనూరాధ గూడూరు మాట్లాడుతూ ‘‘‘మాయాబజార్ ఫర్ సేల్’ 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ సాధించ‌టం సంతోషం. ఈ నెంబ‌ర్ ఇంకా పెరుగుతుంది. జీ 5 కంటెంట్ లైబ్ర‌రీలో ‘మాయాబజార్ ఫర్ సేల్’ రూపంలో మ‌రో అద్భుత‌మైన వెబ్ సిరీస్ చేరింది. మంచి కంటెంట్‌ను ఆద‌రిస్తామ‌ని తెలుగు ప్రేక్ష‌కులు మ‌రోసారి ప్రూవ్ చేశారు. రానా ద‌గ్గ‌బాటిగారి స్పిరిట్ మీడియాతో వ‌ర్క్ చేయ‌టం చాలా హ్యాపీగా ఉంది. ఫ్యూచ‌ర్‌లో ఇలాంటి మంచి ప్రాజెక్ట్స్‌తో అల‌రిస్తాం’’ అన్నారు.

ప్రొడ్యూస‌ర్ రాజీవ్ రంజ‌న్ మాట్లాడుతూ ‘‘డిఫరెంట్ కథలను ఆడియెన్స్‌కి అందించ‌ట‌మే స్పిరిట్ మీడియా ఉద్దేశం. అలా ఫ్యామిలీ అంతా క‌లిసి ఎంజాయ్ చేసేలా తెర‌కెక్కించిన ‘మాయాబజార్ ఫర్ సేల్’ సూప‌ర్బ్ రెస్పాన్స్ వ‌చ్చింది. సిరీస్ వ‌చ్చిన కొద్ది స‌మ‌యంలోనే 100 మిలియ‌న్ స్ట్రీమింగ్ మినిట్స్‌ను సాధించ‌టంపై సంతోషంగా ఉన్నాం’’అన్నారు.

జీ5 కంటెంట్ వైస్ ప్రెసిడెంట్ సాయితేజ మాట్లాడుతూ ‘‘కంటెంట్ ఉంటే మన తెలుగు ప్రేక్షకులు ఎక్కడ ఉన్నా ఆదరిస్తారు. అలాంటి మంచి కంటెంట్ మా మాయబజార్. అందుక‌నే ఈ సిరీస్‌ను ఆడియెన్స్ అంత‌లా ఆదరిస్తున్నారు.రానా ద‌గ్గుబాటి స్పిరిట్ మీడియాతో క‌లిసి ప‌ని చేసిన ‘మాయాబజార్ ఫర్ సేల్’కు ఇంత మంచి ఆద‌ర‌ణ రావ‌టం చాలా సంతోషం. సకుటుంబ సపరివార సమేతంగా చూసే సిరీస్ ఇది. కామెడీతో పాటు మంచి ఎమోష‌న‌ల్ అంశాలు ఇందులో ఉంటాయి. 100 మిలియ‌న్ స్ట్రీమింగ్ మినిట్స్‌తో స‌క్సెస్‌ఫుల్‌గా ఈ సిరీస్ దూసుకెళ్తోంది’’ అన్నారు.

More News

TSRTC:ప్రయాణీలకు అలర్ట్ : హైదరాబాద్ - విజయవాడ హైవేపై పోటెత్తుతోన్న వరద .. టీఎస్ఆర్టీసీ సర్వీసులు బంద్

భారీ వర్షాలు , వరదలతో తెలుగు రాష్ట్రాలు వణికిపోతున్నాయి.

Nassar:కోలీవుడ్‌పై తప్పుడు ప్రచారం.. అలాంటి రూల్స్ లేవు, రోజా భర్తకు సపోర్ట్‌ : పవన్ వ్యాఖ్యలపై నాజర్ స్పందన

తమిళ సినిమాల్లో తమిళులకే అవకాశాలు ఇవ్వాలని.. తమిళ సినిమాలు తమిళనాడులోనే షూటింగ్‌లు జరుపుకోవాలంటూ ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ సౌత్ ఇండియా

Urvashi Rautela:'ఏపీ సీఎం' తో నటించడం ఆనందంగా వుంది .. పవన్‌ను ఉద్దేశిస్తూ ఊర్వశి ట్వీట్,  ఏకీపారేస్తున్న నెటిజన్లు

పవర్‌స్టార్ పవన్ కల్యాణ్, ఆయన మేనల్లుడు సాయిధరమ తేజ్ కలిసి నటిస్తున్న సంగతి తెలిసిందే.

Flood Water:విజయవాడ -హైదరాబాద్‌ హైవే మీదుగా వరద .. నిలిచిన రాకపోకలు, ట్రాఫిక్ మళ్లింపు, మరి గమ్యస్థానాలకు ఎలా..?

తెలుగు రాష్ట్రాల్లో వానలు దంచికొడుతున్న సంగతి తెలిసిందే. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పోటెత్తుతున్నాయి.

Janasena Woman Activists:పవన్‌ కళ్యాణ్‌పై వ్యాఖ్యలు : జోగి రమేష్‌కు చీర , సారె .. వీర మహిళల వినూత్న నిరసన

జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై మంత్రి జోగి రమేష్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఏపీలో నిరసన జ్వాలలు కొనసాగుతూనే ఉన్నాయి.