సెన్సార్ పూర్తి చేసుకొన్న 'మాయా మాల్'

  • IndiaGlitz, [Tuesday,June 20 2017]

దిలీప్, ఇషా, దీక్షాపంత్ ముఖ్యపాత్రధారులుగా రూపొందుతున్న చిత్రం "మాయామాల్". హారర్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని "యు/ఎ" సర్టిఫికెట్ అందుకొంది. జూన్ 30న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. గోవింద్ లాలం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ హారర్ ఎంటర్ టైనర్ ను కె.వి.హరికృష్ణ, చందు ముప్పాళ్ల, నల్లం శ్రీనివాస్ నిర్మిస్తున్నారు.
ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు గోవింద్ లాలం మాట్లాడుతూ.. "మా సినిమా సెన్సార్ పూర్తయ్యింది. హారర్ కి హిలేరియస్ కామెడీ కలగలిసి "మాయా మాల్" ఎగ్జయిటింగ్ హారర్ కామెడీ ఎంటర్ టైనర్ గా రూపొందింది. సినిమా చూసిన సెన్సార్ సభ్యులందరూ బాగుందంటూ మెచ్చుకోవడంతోపాటు.. నా దర్శకత్వ ప్రతిభను కొనియాడడం ఎప్పటికీ మరువలేను. "మాయామాల్" అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే మంచి ఎంటర్‌టైనర్‌ అని నమ్మకంగా చెప్పగలను" అన్నారు.
చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ.. "అనుకున్నదానికంటే సినిమా ఔట్ పుట్ బాగా వచ్చింది. సినిమాలో విలన్ ఎవరనేది ఆసక్తికరమైన అంశం. జూన్ 30న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాం. ప్రేక్షకులు మా చిత్రాన్ని ఆదరిస్తారని ఆశిస్తున్నాను" అన్నారు.
షకలక శంకర్, తాగుబోతు రమేష్, సోనియా, పృథ్వీరాజ్, నాగినీడు, కాశీ విశ్వనాథ్ తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కొరియోగ్రఫీ: సతీష్ శెట్టి, యాక్షన్: విజయ్, కళ: రమణ వంక, ఎడిటింగ్: కార్తీక్ శ్రీనివాస్, సినిమాటోగ్రఫీ: దాశరధి శివేంద్ర, సంగీతం: సాయికార్తీక్, నిర్మాతలు: కె.వి.హరికృష్ణ, చందు ముప్పాళ్ల, నల్లం శ్రీనివాస్, కథ-స్క్రీన్ ప్లే-మాటలు-దర్శకత్వం: గోవింద్ లాలం!

More News

'నమకం..చమకం..' స్థానంలో కొత్త పదాలు చేరిక

స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ హీరోగా స్టార్ డైరెక్టర్ ఎస్.హరీష్ శంకర్ దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై దిల్రాజు, శిరీష్ నిర్మాతలుగా రూపొందిన కమర్షియల్ ఎంటర్టైనర్ `డీజే దువ్వాడ జగన్నాథమ్`.

సంక్రాంతి బరిలోకి బాలయ్య...

నందమూరి బాలకృష్ణ చాలా వేగంగా సినిమాలను పూర్తి చేసేస్తున్నాడు. ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో 101వ సినిమా చేస్తున్న బాలయ్య వచ్చే నెలలో 102వ సినిమాను స్టార్ట్ చేయనున్నాడు. కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో సి.కళ్యాణ్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.

గోపీచంద్ కెరీర్ లో భారీ మొత్తానికి శాటిలైట్...

టాలీవుడ్ హంక్ గోపీచంద్ ఇప్పుడు సంపత్ నంది దర్శకత్వంలో చేస్తున్న సినిమా `గౌతమ్ నంద`. సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటుంది.

నా కాన్ సన్ ట్రేషన్ అంతా తెలుగులోనే - రియా చక్రవర్తి

చాలామంది హీరోయిన్స్ టాలీవుడ్ లో టాలెంట్ నిరూపించుకొని బాలీవుడ్ ఆఫర్స్ కోసం వెయిట్ చేస్తుంటారు. కానీ… రియా చక్రవర్తి మాత్రం బాలీవుడ్ లో ప్రూవ్ చేసుకొని తెలుగు చిత్రాల్లో నటించేందుకు రెడీ అవుతోంది.

ఇంట్రస్టింగ్ టైటిల్ తో శిరీష్..

శ్రీరస్తు శుభమస్తు సినిమాతో హీరోగా మంచి విజయాన్నే అందుకున్నాడు హీరో అల్లు శిరీష్. ఇప్పుడు హర్రర్ థ్రిల్లర్ `ఎక్కడికి పోతావు చిన్నవాడా` దర్శకుడు విఐ.ఆనంద్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. సైంటిఫిక్ థ్రిల్లర్గా సినిమా రూపొందుతోంది.