దిల్‌‌రాజుకు 'మే' సెంటిమెంట్ సరే.. మహేశ్ సంగతేంటి!?

  • IndiaGlitz, [Thursday,March 07 2019]

టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్‌‌ దిల్ రాజు‌‌కు ‘మే’ నెల బాగా కలిసొచ్చింది. అందుకే ఆయన తాను ప్రొడ్యూసర్‌‌గా చేసిన సినిమాలు రిలీజ్ అయితే ‘సంక్రాంతి’ పండుగ లేదా ‘మే’ నెలలోనే ఎక్కువగా విడుదల చేస్తుంటారు. మొత్తమ్మీద ‘మే’ నెల అంటే దిల్‌‌రాజుదే.. ఆ నెలమొత్తం దిల్‌‌ దే హవా అన్నమాట. ఆయన నిర్మాతగా వ్యవహరించిన ‘ఆర్య’ మూవీ మొదలుకుని టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్ నటించిన ‘బ్రహ్మోత్సవం’ వరకు దాదాపు పదికిపైగా సినిమాలు మే నెలలోనే రిలీజ్ చేయడం గమనార్హం. అంతేకాదు మహేష్ బాబు అభిమానులు ఎంతగానో ఎదరుచూస్తున్న ‘మహర్షి’ ని ఇది వరకు అనుకున్న డేట్ కాకుండా.. మే నెలలో విడుదల చేయాలని దిల్‌రాజు ఫిక్స్ అయ్యారు. దీంతో మహర్షి సినిమా మరోసారి వాయిదా పడిందని చెప్పుకోవచ్చు.

‘మే’లో ఇప్పటి వరకూ రిలీజ్ అయిన మూవీస్..

కాగా.. ఇప్పటి వరకూ దిల్‌రాజు నిర్మాతగా వ్యవహరించిన సినిమాలు కొన్ని మే నెలలో విడుదలయ్యాయి.. అవేంటో ఇప్పుడు చూద్దాం. ‘ఆర్య’, ‘భద్ర’,‘మున్నా’,‘పరుగు’, ‘రామ రామ కృష్ణ కృష్ణ’, ‘సుప్రీం’ సినిమాలు రిలీజ్ కాగా త్వరలో ‘మహర్షి’ విడుదల కానున్నది.

మహేశ్ మూవీస్ మే నెలలో..

‘నిజం’, ‘నాని’, ‘బ్రహ్మోత్సవం’ ఈ మూడు మూవీస్ మే నెలలోనే విడుదలయ్యాయి. త్వరలో మే 09న ‘మహర్షి’ విడుదుల కాబోతోంది.

దిల్ రాజు ఏమంటున్నారు..!?

మహర్షి చిత్రాన్ని మే 9న విడుదల చేయబోతున్నాం. మార్చి 17కి మహర్షి చిత్ర టాకీ పార్ట్ పూర్తవుతుంది.. ఆ తర్వాత పాటలు మాత్రం బ్యాలెన్స్ ఉంటాయి. ‘మహర్షి’ చిత్రంలోని కొన్ని పాటలను అబుదాబిలో చిత్రీకరించబోతున్నాం. ఏప్రిల్‌లో మొత్తం షూటింగ్ పూర్తవుతుంది.. ముందుగా అనుకున్న ఏప్రిల్ 25లోపు షూటింగ్ పూర్తవుతుంది. కానీ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలకు సమయం సరిపోదనే కారణంతో సినిమా విడుదలను ఆలస్యం అవుతోంది అని దిల్‌రాజు చెప్పుకొచ్చారు.

మీకు సరే సార్.. మహేశ్ సంగతేంటి..?

దిల్‌రాజుకు మే సెంటిమెంట్ కాబట్టి.. ఆయన ఆ నెలలోనే రిలీజ్ చేయాలని భావిస్తున్నారు.. అతడి వాదనను ఏకీభవించొచ్చు కానీ.. మహేశ్ పరిస్థితి కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని టాలీవుడ్ విశ్లేషకులు చెబుతున్నారు. మహేశ్‌‌ సినిమాల్లో కొన్ని ఇదే నెలలో రిలీజై డిజాస్టర్స్‌గా మిగిలినవున్నాయ్.. ఇందుకు ప్రత్యేకించి మరీ చెప్పనక్కర్లేదు.ఒక్క మాటలో చెప్పాలంటే ఇప్పటి వరకూ మే నెలలో రిలీజ్ అయిన సినిమాలు కలిసిరాలేదని చెప్పుకోవచ్చు. దీంతో మే అంటే చాలు అటు మహేశ్.. అభిమానులు కలవరపడుతున్నారట. మరి ‘మహర్షి’ మేలో ఏ మాత్రం మెప్పిస్తాడో తెలియాలంటే ఆ నెల వచ్చేంత వరకు వేచి చూడాల్సిందే మరి.

More News

బీజేపీ ఎమ్మెల్యేను బూటుతో కొట్టిన ఎంపీ..

జడ్పీటీసీ సమావేశాలు మొదలుకుని అసెంబ్లీ సమావేశాల వరకు అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు ఏ రేంజ్‌‌లో విమర్శల వర్షం కురిపించుకుంటారో మనందరం చూసే ఉంటాం.

చంపేస్తారా? చంపేయండి.. చావడానికి రె‘ఢీ’!

టీడీపీ అధికార ప్రతినిధి యామిని సాధినేనిపై వైసీపీ, జనసేన కార్యకర్తలు కొందరు సోషల్‌ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టడంతో రెండు వేర్వేరు కేసుల్లో పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే.

కీలక నిర్ణయం: స్టీఫెన్ రవీంద్ర చేతికి ‘డేటా చోరీ’ కేసు

‘డేటా చోరీ’ కేసులో తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే పలువుర్ని విచారించిన సైబరాబాద్ పోలీసులు.. ‘ఐటీ గ్రిడ్’ డైరెక్టర్‌ లుక్ అవుట్ నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే.

'సర్వం తాళ మయం' మార్చ్ 8 విడుదల

శంకరాభరణం, సాగర సంగమం వంటి అద్భుత సంగీత భరిత చిత్రాలను అందించిన కళాతపస్వి కె. విశ్వనాథ్ రాజీవ్ మీనన్ రూపొందించిన 'సర్వం తాళ మయం' చిత్రాన్ని

స‌మ్మ‌ర్‌లో భ‌య‌పెట్ట‌నున్న లారెన్స్‌

రాఘ‌వ లారెన్స్ న‌టిస్తూ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న హార‌ర్ థ్రిల్ల‌ర్ మూవీ 'కాంచ‌న' సిరీస్‌. ఇప్ప‌టి వ‌ర‌కు రెండు పార్టులు విడుద‌లై ఘ‌న విజ‌యాన్ని సాధించాయి.