'మత్తు వదలరా' రిలీజ్ కూడా అప్పుడేనట!
- IndiaGlitz, [Tuesday,December 03 2019]
పెద్ద బ్యాగ్రౌండ్ ఉన్న ఓ చిన్న చిత్రం 'మత్తు వదలరా'. దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి అన్నయ్య, ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి తనయుడు శ్రీసింహా హీరోగా నటిస్తోన్న చిత్రమిది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌తో పాటు క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్ నిర్మాణంలో రితేష్ రానా దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. యన్టీఆర్ 'యమదొంగ'లో బాల ఎన్టీఆర్‌గా, మర్యాద రామన్న, బాహుబలి ది బిగినింగ్ చిత్రాల్లో నటించిన సింహా ఇప్పుడు హీరోగా ఎంట్రీ ఇచ్చేస్తున్నాడు. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. లేటెస్ట్ సమాచారం మేరకు ఈ చిత్రాన్ని కిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న విడుదల చేయబోతున్నారట. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుంది.
ఇప్పటికే కిస్మస్ బరిలో ఇప్పటికే డిసెంబర్ 20 బాలకృష్ణ రూలర్, సాయితేజ్ ప్రతిరోజూ పండగే, కార్తి దొంగ చిత్రాలతో పాటు సల్మాన్‌ఖాన్ దబాంగ్ 3 విడుదల కానుంది. అలాగే మరో ఐదు రోజుల గ్యాప్‌తో డిసెంబర్ 25న రాజ్ తరుణ్ ఇద్దరి లోకం ఒకటే సినిమా విడుదల కానుంది. కాగా ఈ రేసులో ఇప్పుడు 'మత్తు వదలరా' సినిమా విడుదల కానుంది. కాన్సెప్ట్ బేస్డ్ మూవీగా రూపొదిన ఈ చిత్రం క్రిస్మస్ పోరులో సక్సెస్ అవుతుందో లేదో చూడాలి. సినిమా చిన్న బడ్జెట్‌తో రూపొందినప్పటికీ రాజమౌళి, కీరవాణి వంటి వారి సపోర్ట్ ఉండటంతో సినిమాకు ప్రమోషన్స్ పరంగా ఢోకా ఉండకపోవచ్చు.