Matarani Mounamidi: ఆగస్టులో విడుదలకు సిద్ధమవుతున్న 'మాటరాని మౌనమిది'
Send us your feedback to audioarticles@vaarta.com
రుద్ర పిక్చర్స్ మరియు పిసిర్ గ్రూప్ సమర్పణలో శుక్ర దర్శకుడు సుకు పూర్వాజ్ చేస్తున్న కొత్త సినిమా "మాటరాని మౌనమిది". మహేష్ దత్త, సోని శ్రీవాస్తవ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. లవ్ స్టొరి, థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ లో ముల్టి జోనర్ గా రూపొందుతున్న "మాటరాని మౌనమిది" సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకుని ఆగష్టులో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్ర
ప్రెస్ మీట్ ను హైదరాబాద్ లో నిర్వహించారు.
ఈ సందర్భంగా..
దర్శకుడు సుకు పూర్వాజ్ మాట్లాడుతూ.. కోవిడ్ టైమ్ లో మేము తీసిన శుక్ర సినిమా గతేడాది ఏప్రిల్ లో రిలీజ్ అయ్యింది. ఆ సినిమా మాకు చాలా పేరు తీసుకొచ్చింది. ఆ ప్రోత్సాహంతో మాటరాని మౌనమిది చిత్రాన్ని రూపొందించాను. ఈ సినిమా ఫస్ట్ కాపీ వచ్చింది. నిన్న కొంతమందికి ప్రివ్యూ వేశాము. అందరూ బాగుందన్నారు. మల్టీ జానర్ థ్రిల్లర్ బ్యాక్ గ్రౌండ్ లో ఒక కొత్త లవ్ స్టోరిని చూపిస్తున్నాం. ఆగష్టులో థియేటర్స్ లలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయబోతున్నాం. నటీనటులు, టెక్నీషియన్స్ సపోర్ట్ వల్లే ఈ చిత్రం ఇంత బాగా వచ్చింది. మంచి కథతో వస్తున్న ఈ సినిమా అందరికీ తప్పకుండా నచ్చుతుంది. అన్నారు.
నిర్మాత వాసుదేవ్ మాట్లాడుతూ.. సుకు చెప్పిన లైన్ నచ్చడంతో ఈ సినిమా చేశాము.నటీ నటులు, టెక్నిషియన్స్ అందరూ సహకరించడంతో సినిమా బాగా వచ్చింది. త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తున్నా ఈ చిత్రం అందరికీ తప్పకుండా నచ్చుతుంది. అన్నారు.
నిర్మాత ప్రభాకర్ మాట్లాడుతూ.. మేము ఈ కథ విన్నప్పుడు ఎంత ఎగ్జైట్ అయ్యామో ప్రివ్యూ చూసిన తరువాత అంతకంటే ఎక్కువ సంతోషించాం. సినిమా ఎక్స్ పెక్ట్ చేసిన దానికంటే బాగా వచ్చింది. సినిమా ప్రేక్షకులకు సస్పెన్స్, థ్రిల్లర్ అంశాలను అందిస్తూనే ఆద్యంతం ఆకట్టుకుంటుంది.అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ అషీర్ లూక్ మాట్లాడుతూ.. సుకు దర్శకత్వంలో శుక్ర సినిమాకు వర్క్ చేశాను. మ్యూజికల్ గా ఈ సినిమాకు ఎక్కువ స్కోప్ ఉంది. కథలో ఉన్న అవకాశమే మంచి మ్యూజిక్ ఇచ్చేలా ఇన్ స్పైర్ చేసింది. అన్నారు.
హీరో మహేష్ దత్త మాట్లాడుతూ... ఈ సినిమాతో మేమొక ఒక కొత్త అటెంప్ట్ చేశాం. మాటరాని మౌనమిది సినిమా చూసిన తరువాత అందరూ ఇదే ఫీలవుతారు. టీమ్ అంతా సినిమా కోసం అంకితభావంతో పనిచేశారు. పెద్ద సినిమాలకు ఏ మాత్రం తగ్గని అషీర్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. అన్నారు.
హీరోయిన్ సోనీ మాట్లాడుతూ... దర్శకుడు సుకు పూర్వాజ్ తెలుగు అమ్మాయి ప్రతిభను గుర్తించి అవకాశమిచ్చారు. ఇందులో నా క్యారెక్టర్ ఆకట్టుకునేలా ఉంటుంది. డైలాగ్స్ హార్ట్ టచింగ్ గా ఉంటాయి. టీమ్ వర్క్ చేసి మంచి ఔట్ పుట్ తీసుకొచ్చాం. అని చెప్పింది.
నటి అర్చన మాట్లాడుతూ... నేను ఇక్కడిదాకా వచ్చేందుకు కారణమైన గగన్ టెలిషో కు కృతజ్ఞతలు. అలాగే ఈ చిత్రంలో నేను ఒక వైవిధ్యమైన పాత్రలో నటించాను. ఆ క్యారెక్టర్ నేను చేయగలను అని నమ్మిన దర్శకుడు సుకూ పూర్వాజ్ కు థాంక్స్. ఈ సినిమా గురించి మేము చెప్పడం కన్నా చూసి మీరే ఎలా ఉందో చెప్పండి. మా టీమ్ అందరికీ విశెస్ చెబుతున్నా. అన్నారు.
నటీ నటులు - మహేష్ దత్త, సోని శ్రీవాస్తవ, అర్చన అనంత్, సుమన్ శెట్టి, సంజీవ్ , శ్రీహరి తదితరులు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments