'మాస్ట‌ర్' రిలీజ్ డేట్‌.. ప్లాన్ అదే!

  • IndiaGlitz, [Monday,January 27 2020]

కోలీవుడ్ అగ్ర క‌థానాయ‌కుడు విజ‌య్ హీరోగా లోకేశ్ క‌న‌క‌రాజ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం 'మాస్ట‌ర్‌'. ఎక్స్‌బీ ఫిలిం క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై గ్జేవియ‌ర్ బ్రిటో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మాళ‌వికా మోహ‌న‌న్ హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ చిత్రంలో విజ‌య్ సేతుప‌తి విల‌న్‌గా న‌టిస్తున్నాడు. ఆండ్రియా కీల‌క పాత్ర‌లో న‌టిస్తుంది. ఈ చిత్రంలో విజ‌య్ ద్విపాత్రాభిన‌యం చేస్తున్నారని టాక్‌. విద్యార్థి, మాస్ట‌ర్ అనే రెండు పాత్ర‌ల్లో విజ‌య్ ఎలా ఆక‌ట్టుకుంటాడ‌నేది ఆస‌క్తిక‌రంగా మారింది. లేటెస్ట్ స‌మాచారం మేర‌కు ఈ చిత్రాన్ని ఏప్రిల్ 10న విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నార‌ని టాక్‌.

ప‌ర్టికుల‌ర్‌గా అదే రోజున సినిమాను విడుద‌ల చేయ‌డానికి కార‌ణం గుడ్ ఫ్రేడే, శనివారం, ఆదివారంతో పాటు ఏప్రిల్ 14న త‌మిళ సంవ‌త్స‌రాది కూడా ఉండ‌టంతో క‌లెక్ష‌న్స్ ప‌రంగా సినిమాకు బాగా క‌లిసొస్తుంద‌ని మేక‌ర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. ఇప్ప‌టికే రెండు లుక్స్ విడుద‌ల చేసిన చిత్ర యూనిట్ జ‌న‌వ‌రి 26న విజ‌య్‌, విజ‌య్ సేతుప‌తి ఉన్న లుక్‌ను విడుద‌ల చేశారు. ఖైదీ వంటి సెన్సేష‌న‌ల్ హిట్ త‌ర్వాత లోకేశ్ క‌న‌క‌రాజ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్ర‌మిది.

More News

`డబ్‌శ్మాష్‌` త‌ప్ప‌కుండా పెద్ద విజ‌యం సాధిస్తుంది - చిత్ర స‌మ‌ర్ప‌కులు సుబ్రమణ్యం మలసాని

వీత్రి ఫిలిమ్స్ పతాకంపై సుబ్రమణ్యం మలసాని సమర్పణలో ఓంకార లక్ష్మీ నిర్మాతగా  పవన్ కృష్ణ, సుప్రజ,  హీరో హీరోయిన్లుగా గెటప్ శ్రీను ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం `డబ్‌శ్మాష్‌`.

'సీటీమార్‌' ఫ‌స్ట్‌లుక్ విడుద‌ల‌!!

మ్యాచోస్టార్‌ గోపీచంద్‌ హీరోగా మాస్‌ డైరెక్టర్‌ సంపత్‌ నంది దర్శకత్వంలో 'యు టర్న్‌'లాంటి సూపర్‌హిట్‌ చిత్రాన్ని అందించిన శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌  పతాకంపై

యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌ 'వి'.. సుధీర్‌బాబు ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌

నేచుర‌ల్ స్టార్ నాని, మోహ‌న‌కృష్ణ ఇంద్ర‌గంటి కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న హ్యాట్రిక్ మూవీ `వి`. తొలి రెండు చిత్రాల్లో నానిని డిఫ‌రెంట్‌గా చూపించిన డైరెక్ట‌ర్ మోహ‌న‌కృష్ణ ఇంద్ర‌గంటి

'83' ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌

భార‌త క్రికెట్ చ‌రిత్ర‌లో 1983 సంవ‌త్స‌రం భార‌త క్రికెట్ జ‌ట్టు విశ్వ విజేత‌గా ఆవిర్భ‌వించిన సంగ‌తి తెలిసిందే. అయితే ఆ విజ‌యం అంత సుల‌భంగా ద‌క్క‌లేదు.

రామోజీ రావుపై ఆగ్రహంతో ఊగిపోయిన బొత్స

2019 ఎన్నికల అనంతరం అఖండ మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ‘ఈనాడు’,‘ఆంధ్రజ్యోతి’ మీడియా సంస్థలపై తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్న సంగతి తెలిసిందే.