సోనూసూద్ ఫౌండేషన్ పేరుతో భారీ మోసం
Send us your feedback to audioarticles@vaarta.com
ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా.. పోలీసులు ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తున్నా.. సైబర్ నేరగాళ్లు మాత్రం రెచ్చిపోతూనే ఉన్నారు. రకరకాల దారుల్లో వస్తూ సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ బురిడీ కొట్టిస్తూనే ఉన్నారు. కొత్త తరహాలో నేరాలకు బాట వేసుకుంటూ.. డబ్బులు కొట్టేస్తూనే ఉన్నారు. ఇటీవల ‘భీష్మ’ డైరెక్టర్‌కు టోకరా వేసిన ఆయన నుంచి 66 వేల రూపాయలకు పైగా డబ్బు కొట్టేశారు. ఇప్పుడు ప్రముఖ నటుడు సోనూ సూద్ పేరు వాడి ఓ సైబర్ నేరగా భారీ మోసానికి పాల్పడ్డారు. సోనూ పేరు చెప్పగానే ఓ వ్యక్తి రూ.60 వేల రూపాయలు ముట్టజెప్పాడు.
సాయం అని తన వద్దకే వెళ్లనక్కర్లేదు. ఏదైనా టీవీ ఛానల్‌లో ఫలానా వ్యక్తి కష్టంలో ఉన్నారని తెలిసినా చాలు సోనూసూద్ అక్కడ వాలిపోతారు. అడక్కుండానే సాయం చేసేస్తుంటారు. ఇక ఎవరైనా అడిగితే ఆగుతారా? సోనూసూద్ ఈ గుణాన్నే తమ నేరానికి అనుకూలంగా మార్చుకున్నాడో వ్యక్తి. సోను సూద్ ఫౌండేషన్ పేరుతో సైబర్ నేరగాడు భారీ మోసానికి పాల్పడ్డాడు. ఆన్‌లైన్‌లో తన మొబైల్ నంబర్‌ను సోను సూద్ పేరుతో సేవ్ చేసుకున్నాడు. సాయం కోసం ఆశ్రయించిన మాదాపూర్ వ్యక్తిని దారుణంగా మోసం చేశాడు.
తను కష్టంలో ఉన్నానని.. తను సాయం కావాలని హైదరాబాద్ మాదాపూర్‌కు చెందిన ఓ వ్యక్తి ఈ నకిలీ సోనూసూద్ ఫౌండేషన్‌ను ఆశ్రయించాడు. పంకజ్ సింగ్ అనే సైబర్ నేరగాడు రిజిస్ట్రేషన్ ప్రాసెసింగ్ ఫీజు పేరుతో రూ. 60 వేలు వసూలు చేసాడు. డబ్బులు చెల్లించినా ఎంతకీ సాయం అందకపోవడంతో సదరు వ్యక్తికి అనుమానం వచ్చింది. వెంటనే బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments