Visakhapatnam:విశాఖలోని ఓ ఆసుపత్రిలో భారీ అగ్నిప్రమాదం
Send us your feedback to audioarticles@vaarta.com
విశాఖపట్టణంలోని ఇండస్ ఆసుపత్రిలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. జగదాంబకూడలి సమీపంలో ఉన్న ఈ ఆసుపత్రిలో భారీగా మంటలు ఎగసిపడ్డాయి. దీంతో దట్టమైన పొగ అలుముకోవడంతో ఆసుపత్రిలోని రోగులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. కొంతమంది రోగులతో పాటు విజిటర్స్ బయటకు పరుగులు తీశారు. అయితే మరికొంతమంది రోగులు మాత్రం ప్రాణభయంతో బిక్కుబిక్కుమని ఉండిపోయారు. రోగుల హాహాకారాలతో ఆసుపత్రి ప్రాంగణం నిండిపోయింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని నాలుగు ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి ఆర్పేందుకు ప్రయత్నం చేస్తున్నారు.
సుమారు 40 మంది రోగులను అంబులెన్స్‌లలో సమీపంలోని వివిధ ఆస్పత్రులకు తరలించారు. ఆస్పత్రిలోని పైఅంతస్తుల్లో ఉన్న రోగులను నిచ్చెనల సహాయంతో కిందికి తీసుకొచ్చారు. ఆపరేషన్ థియేటర్లో జరిగిన ప్రమాదం కారణంగానే మంటలు వచ్చాయని తెలుస్తోంది. ఈ ఘటనకు షార్ట్ సర్క్యూట్ కారణమా? మరేదైనా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com