Visakhapatnam:విశాఖలోని ఓ ఆసుపత్రిలో భారీ అగ్నిప్రమాదం

  • IndiaGlitz, [Thursday,December 14 2023]

విశాఖపట్టణంలోని ఇండస్‌ ఆసుపత్రిలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. జగదాంబకూడలి సమీపంలో ఉన్న ఈ ఆసుపత్రిలో భారీగా మంటలు ఎగసిపడ్డాయి. దీంతో దట్టమైన పొగ అలుముకోవడంతో ఆసుపత్రిలోని రోగులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. కొంతమంది రోగులతో పాటు విజిటర్స్ బయటకు పరుగులు తీశారు. అయితే మరికొంతమంది రోగులు మాత్రం ప్రాణభయంతో బిక్కుబిక్కుమని ఉండిపోయారు. రోగుల హాహాకారాలతో ఆసుపత్రి ప్రాంగణం నిండిపోయింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని నాలుగు ఫైర్ ఇంజన్‌లతో మంటలను అదుపులోకి ఆర్పేందుకు ప్రయత్నం చేస్తున్నారు.

సుమారు 40 మంది రోగులను అంబులెన్స్‌లలో సమీపంలోని వివిధ ఆస్పత్రులకు తరలించారు. ఆస్పత్రిలోని పైఅంతస్తుల్లో ఉన్న రోగులను నిచ్చెనల సహాయంతో కిందికి తీసుకొచ్చారు. ఆపరేషన్‌ థియేటర్‌లో జరిగిన ప్రమాదం కారణంగానే మంటలు వచ్చాయని తెలుస్తోంది. ఈ ఘటనకు షార్ట్‌ సర్క్యూట్‌ కారణమా? మరేదైనా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

More News

Smita Sabharwal:కేంద్ర సర్వీసులకు వెళ్లడం లేదు.. స్వితా సభర్వాల్ క్లారిటీ..

తెలంగాణ సీనియర్ ఐపీఎస్ అధికారి స్వితా సభర్వాల్.. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించారు.

Rana:‘రాక్షస రాజా’గా రానా.. ‘నేనే రాజు నేనే మంత్రి’ కాంబో ఈజ్ బ్యాక్..

హీరో దగ్గుబాటి రానా తన పుట్టినరోజు సందర్భంగా కొత్త సినిమాను ప్రకటించారు. తనకు బ్లాక్‌బాస్టర్ హిట్ ఇచ్చిన తేజ దర్శకత్వంలో

Gaddam Prasad:తెలంగాణ శాసనసభాపతిగా బాధ్యతలు స్వీకరించిన గడ్డం ప్రసాద్

తెలంగాణ అసెంబ్లీ మూడో స్పీకర్‌గా గడ్డం ప్రసాద్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు  ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఒవైసీ ప్రకటించారు.

Bigg Boss Telugu 7 : బిగ్‌బాస్ నాకు రెండో తల్లి అన్న యావర్ .. రైతు గర్వపడేలా చేస్తానన్న ప్రశాంత్ , ఇద్దరూ ఏడిపించేశారుగా

బిగ్‌బాస్ 7 తెలుగు ఈ వారంతో ముగియనున్న సంగతి తెలిసిందే. గత వారం శోభాశెట్టి ఎలిమినేట్ కాగా..

Guntur Karaam:'గుంటూరు కారం' నుంచి క్లాస్ సాంగ్ వచ్చేసిందోచ్..

సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులకు మరో శుభవార్త వచ్చేసింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో