టర్కీలో భారీ భూకంపం.. భయంతో జనం పరుగులు..

  • IndiaGlitz, [Friday,October 30 2020]

భూకంపం టర్కీ, గ్రీస్ దేశాల ప్రజలను భయకంపితులను చేసింది. టర్కీ‌‌లోని ఏజియన్ సముద్రంలో శుక్రవారం భారీ భూకంపం సంభవించింది. ఈ కారణంగా సముద్రంలో చిన్నపాటి సునామీ సైతం సంభవించింది. దీంతో పెద్ద ఎత్తున అలలు ఎగసిపడ్డాయి. సునామీ భయంతో ప్రజలు రోడ్లపైకి పరుగులు తీశారు. ఏజియన్ సముద్రంలో సముద్రంలో 16.5 కిలో మీటర్ల లోతులో భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.6గా నమోదైనట్టు డిజాస్టర్ ఎమర్జెన్సీ మేనేజిమెంట్ అథారిటీ (ఏఎఫ్ఏ‌డీ) వెల్లడించింది.

కాగా.. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 7.0గా నమోదైనట్టు అమెరికా జియోలాజికల్ సర్వే పేర్కొంది. భూకంప తీవ్రతకు ఒక్క బేరాక్లి జిల్లాలోనే 10 భవంతులు కుప్పకూలాయి. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సునామీ కారణంగా వీధుల్లోకి నీరు చేరుకుంది. ఈ నేపథ్యంలో ఎలాంటి ఆస్తి నష్టమూ సంభవించలేదని.. ప్రాణ నష్టానికి సంబంధించిన సమాచారమూ లేదని ఇజ్మిర్, ఇస్తాంబుల్ గవర్నర్లు వెల్లడించారు. ఇజ్మీర్‌లో తీవ్రమైన భూప్రకంపనలు రావడంతో ప్రజలు భయంతో పరుగులు తీశారని మీడియా కథనాలు వెలువడ్డాయి.

More News

కోలుకుంటున్న హీరో రాజశేఖర్.. వెంటిలేటర్ తొలగింపు

కరోనా నుంచి హీరో రాజశేఖర్ క్రమక్రమంగా కోలుకుంటున్నారు. నేడు ఆయనకు వెంటిలేటర్‌ను సైతం వైద్యులు తొలిగించారు.

అక్కడ కరోనా రెండో దశ ప్రారంభం.. తెలంగాణలో అధికారుల అప్రమత్తం..

కరోనా ప్రభావంతో పాటు భయం కూడా జనాల్లో బాగా తగ్గిపోయింది. జనజీవనం అంతా యథాతథ స్థితికి వచ్చేసింది.

'ఆర్‌ఆర్‌ఆర్‌' కోసం ఆలియా భట్‌ పాట

బాహుబలితో తెలుగు సినిమా స్థాయిని పెంచిన దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో టాలీవుడ్ అగ్ర కథానాయకులు యంగ్ టైగర్ ఎన్టీఆర్‌, మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ కాంబినేష‌న్‌లో

ఇండియాలో రికార్డ్ స్థాయిలో ఆపిల్ అమ్మకాలు..

భారతదేశంలో ఇటీవలే ఆన్‌లైన్ స్టోర్‌ను ప్రారంభించిన టెక్ దిగ్గజ సంస్థ ఆపిల్ రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తోంది.

మూడు చిత్రాలను ప్రకటించిన ఫోర్బ్స్‌లో చోటు దక్కించుకున్న యువ వ్యాపారవేత్త సురేష్‌రెడ్డి

కొవ్వూరి సురేష్‌రెడ్డి... యానిమేషన్‌ గేమింగ్ రంగంలో ఈ పేరు సుపరిచితమే.