టర్కీలో భారీ భూకంపం.. భయంతో జనం పరుగులు..
Send us your feedback to audioarticles@vaarta.com
భూకంపం టర్కీ, గ్రీస్ దేశాల ప్రజలను భయకంపితులను చేసింది. టర్కీలోని ఏజియన్ సముద్రంలో శుక్రవారం భారీ భూకంపం సంభవించింది. ఈ కారణంగా సముద్రంలో చిన్నపాటి సునామీ సైతం సంభవించింది. దీంతో పెద్ద ఎత్తున అలలు ఎగసిపడ్డాయి. సునామీ భయంతో ప్రజలు రోడ్లపైకి పరుగులు తీశారు. ఏజియన్ సముద్రంలో సముద్రంలో 16.5 కిలో మీటర్ల లోతులో భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.6గా నమోదైనట్టు డిజాస్టర్ ఎమర్జెన్సీ మేనేజిమెంట్ అథారిటీ (ఏఎఫ్ఏడీ) వెల్లడించింది.
కాగా.. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 7.0గా నమోదైనట్టు అమెరికా జియోలాజికల్ సర్వే పేర్కొంది. భూకంప తీవ్రతకు ఒక్క బేరాక్లి జిల్లాలోనే 10 భవంతులు కుప్పకూలాయి. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సునామీ కారణంగా వీధుల్లోకి నీరు చేరుకుంది. ఈ నేపథ్యంలో ఎలాంటి ఆస్తి నష్టమూ సంభవించలేదని.. ప్రాణ నష్టానికి సంబంధించిన సమాచారమూ లేదని ఇజ్మిర్, ఇస్తాంబుల్ గవర్నర్లు వెల్లడించారు. ఇజ్మీర్‌లో తీవ్రమైన భూప్రకంపనలు రావడంతో ప్రజలు భయంతో పరుగులు తీశారని మీడియా కథనాలు వెలువడ్డాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments